ఒక పెద్ద హీరో నటించిన భారీ చిత్రం రిలీజైతే ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఉండే సందడే వేరు. చివరగా ఆ సందడిని ‘వకీల్ సాబ్’ టైంలో చూశాం. అప్పుడు బాక్సాఫీస్ కళకళలాడటం చూసి తర్వాత రాబోయే పెద్ద సినిమాల మీద భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు సినీ ప్రేక్షకులు. కానీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడి అన్ని ఆశలకూ తెరదించింది. మళ్లీ థియేటర్లను కొన్ని నెలల పాటు మూత వేయించింది. జులై నెలాఖర్లో మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాక అడపాదడపా కొన్ని సినిమాలు విజయవంతమైనా ఎక్కడో ఏదో అసంతృప్తి.
ఇంకా ఏదో కావాలనే ఆశ. ఓ భారీ చిత్రం వచ్చి బాక్సాఫీస్ మోత మోగించాలన్నదే అందరి ఆశ. ‘అఖండ’ అలాంటి సినిమానే అవుతుందనే అంచనాలు కలిగాయి. బాలయ్య-బోయపాటిల కాంబినేషన్ క్రేజ్.. మాస్‌కు పూనకాలు తెప్పించిన ఈ సినిమా ట్రైలర్లు.. తమన్ పాటలు కలిపి అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇక ఈ రోజు ‘అఖండ’ థియేటర్లలోకి దిగింది.టాక్ ఎలా ఉంది.. సినిమా ఏమేర సంతృప్తి పరిచింది అన్నది పక్కన పెడితే.. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు.. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు.. అలాగే యుఎస్.. యూకే.. గల్ఫ్.. ఇలా ఎక్కడ చూసినా ‘అఖండ’ సందడి మామూలుగా లేదు.
భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి సమయానికి యుఎస్‌లో ఫస్ట్ షో మొదలు కాగా.. కొన్ని గంటల తర్వాత హైదరాబాద్‌లో నాలుగ్గంటల ప్రాంతంలో భ్రమరాంభ-మల్లికార్జున థియేటర్లలో.. ఆపై ఏపీలో పలు చోట్ల బెనిఫిట్ షోల హంగామా మొదలైంది. ఎక్కడ చూసినా బాలయ్య అభిమానుల సందడి మామూలుగా లేదు. అన్ని షోలూ హౌస్ ఫుల్స్.. థియేటర్ల ముందర, లోపల సందడే సందడి. జై బాలయ్య నినాదాలతో.. పూలు.. కాగితాల వర్షాలతో అన్ని థియేటర్లూ హోరెత్తిపోయాయి. యుఎస్‌లో డల్లాస్‌లో ఒక థియేటర్లో కొబ్బరికాయల మోత.. థియేటర్ లోపల అభిమానుల హంగామా చూస్తే ఆంధ్రాలో పక్కా మాస్ ఏరియాలో సినిమా ప్రదర్శితమవుతున్నట్లుగా కనిపించింది.
ఇక హైదరాబాద్‌లో.. ఏపీలో పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ గురువారం ‘అఖండ’నే ప్రదర్శితమవుతోంది. ఎన్ని థియేటర్లలో అయినా.. ఎన్ని షోలు వేసినా.. అన్నింటికీ అదిరిపోయే రెస్పాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి ‘అఖండ’పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్స్ రాబట్టబోతోందని అర్థమైంది. ఈ సందడి ఇలాగే కొనసాగి టాలీవుడ్ బాక్సాఫీస్ టాప్ గేర్‌లో దూసుకెళ్లాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.
This post was last modified on December 2, 2021 5:25 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…