ఆంధ్రప్రదేశ్ లో ఆన్ లైన్ టికెటింగ్ విధానం, టికెట్ల రేట్లపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విధానంపై టాలీవుడ్ ప్రముఖుల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. కొందరు దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఈ విధానానికి మద్దతు పలకగా…మరికొందరు విభేదించారు. ఈ క్రమంలోనే ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ వ్యవహారానికి సంబంధించిన బిల్లు పాసైంది.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో సినిమా టికెట్ల కొత్త రేట్లను ప్రభుత్వం నేడు ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ…ఇలా ప్రాంతాలవారీగా ధరలను నిర్ణయించింది. మల్టీప్లెక్సులు, సింగిల్ థియేటర్లకు రేట్లను నిర్దేశించింది. కొత్త రేట్ల ప్రకారం సినిమా టికెట్ కనిష్ట ధర రూ.5 కాగా, గరిష్ట ధర రూ.250. దీంతోపాటు, ఏపీలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని తెలుస్తోంది.
మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో
మల్టీప్లెక్సు- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20
మున్సిపాలిటీ ప్రాంతాల్లో
మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15
నగర పంచాయతీల్లో
మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో
మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5