ఆర్ఆర్ఆర్ టీం అన్నీ చూసుకునే జనవరి 7వ తేదీని రిలీజ్ డేట్‌గా ఎంచుకుంది. ఇంకోసారి డేట్ మారిస్తే ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో తెలిసిందే కాబట్టి.. కొన్ని ఇబ్బందులున్నప్పటికీ ఆ డేట్‌కే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ప్రమోషన్లు కూడా జోరుగా చేస్తోంది కానీ ఈ సినిమాకు ఇది సరైన రిలీజ్ డేట్ కాదు అనే అభిప్రాయం బలపడుతోంది. ఓవైపు తెలుగులో ఎంత పెద్ద స్థాయిలో సినిమాను రిలీజ్ చేసినా.. ఐదో రోజుల తర్వాత భీమ్లా నాయక్ కోసం.. ఏడు రోజుల తర్వాత రాధేశ్యామ్ సినిమాల కోసం థియేటర్లు చాలా వరకు వదులుకోవాల్సి ఉంటుంది.
ఆర్ఆర్ఆర్ స్థాయి సినిమా అంటే కొన్ని వారాల పాటు ఎక్కువ థియేటర్లలో ఆడాలి. అప్పుడే పెట్టుబడి రికవరీ అవుతుంది. ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి. కానీ తెలుగులోనే ఈ చిత్రానికి అడ్డంకులు తప్పట్లేదు. బాహుబలిలా కొన్ని వారాల పాటు మెజారిటీ థియేటర్లలో ఆడే అవకాశాన్ని ఆర్ఆర్ఆర్ కోల్పోతోంది. సినిమా ఎంత బాగున్నా సరే.. థియేటర్లు కోల్పోక తప్పదు. రాధేశ్యామ్ నుంచి తెలుగు రాష్ట్రాల అవతల కూడా ఆర్ఆర్ఆర్‌కు పోటీ తప్పదు. ఇక తమిళంలో ఆర్ఆర్ఆర్‌కు పెద్ద అడ్డంకి తప్పేలా లేదు. అజిత్ సినిమా వలిమై సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతోంది.
అక్కడ అజిత్ క్రేజ్ గురించి, ఈ సినిమాపై ఉన్న అంచనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆర్ఆర్ఆర్‌కు బాహుబలిలా అక్కడ గ్రాండ్ వెల్కం ఉండకపోవచ్చు. వలిమైకే పెద్ద పీట వేయక తప్పదు. దీనికి తోడు ప్రభాస్ సినిమా రాధేశ్యామ్‌తోనూ తమిళంలో పోటీ ఉంటుంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్‌కు ఇది ఇబ్బందికర పరిస్థితే. దీని బదులు వేసవి లాంటి సీజన్ చూసుకుని ఉంటే రెండు మూడు వారాల పాటు ఈ సినిమాకు ఏ డిస్టబెన్స్ ఉండేది కాదని.. దానికది రైట్ టైం అయ్యుండేడదన్నఅభిప్రాయం కలుగుతోంది.