శివశంకర్ మాస్టర్… దేశం గర్వించదగ్గ డ్యాన్స్ మాస్టర్లలో ఒకడు. ఏకంగా 800కు పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన ఘన చరిత్ర ఆయనది. 80వ దశకంతో మొదలుపెట్టి మూడు దశాబ్దాలకు పైగా ఆయన విరామం లేకుండా డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశారు. మగధీర సినిమాలో ధీర ధీర పాటకు ఆయన జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. గత దశాబ్ద కాలంలో ఆయన పెద్దగా నృత్య దర్శకత్వం చేసింది లేదు.
డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించడం.. అలాగే సినిమాల్లో కొన్ని కామెడీ రోల్స్ చేయడం ద్వారా బిజీగానే ఉన్నారు. ఈ మధ్య ఆయన సినిమాలు, టీవీ షోల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. కొన్ని రోజుల కిందటే కొవిడ్‌తో విషమ స్థితికి చేరుకున్నారన్న వార్తతో శివశంకర్ వార్తల్లోకి వచ్చారు. ఇంతలోనే ఆయన మరణ వార్త వినాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన గొప్పదనం గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
డ్యాన్స్ మాస్టర్‌గా 800 పైగా సినిమాలకు పని చేసిన శివశంకర్ చిన్న తనంలో మంచం నుంచి కదల్లేని స్థితిలో ఎన్నో ఏళ్లు గడిపాడని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన లేచి నడవడమే కష్టమనుకుంటే.. డ్యాన్స్ మాస్టర్ అయి వందల సినిమాలకు పని చేయడం విడ్డూరమే. తమిళనాడులో పుట్టిన శివశంకర్ ఏడాదిన్నర వయసులో ఉండగా తమ ప్రాంతంలో ఒక ఆవు తాడు తెంచుకుని మీదికి వస్తుంటే తప్పించుకోబోయి కింద పడగా.. వెన్నెముక విరిగిపోయిందట.
నెల రోజుల పాటు జ్వరం, నొప్పితో బాధపడుతూ ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోయిందట. అదే సమయంలో విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్ అనే ఆయన వద్దకు శివశంకర్‌ను తీసుకెళ్లారట ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్ధారించారయన. అప్పుడా డాక్టర్ ‘ఈ పిల్లాడిని ఎవరి వద్దకు తీసుకెళ్లకుండా నా దగ్గర వదిలేస్తే లేచి నడిచేలా చేయగలను’ అని అన్నారు.
ఆయనను నమ్మి శివశంకర్ తండ్రి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆయన చికిత్స అందించాక కూడా కోలుకోవడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఎనిమిదే ఏడు వచ్చే వరకు శివశంకర్ అందరు పిల్లల్లా లేచి తిరగలేకపోయారు. ఆ తర్వాత కోలుకుని లేచి తిరిగారు. చిన్న వయసులోనే డ్యాన్స్‌పై ఆసక్తితో అటు వెళ్లిపోయారు. తర్వాతంతా ఒక చరిత్ర.
This post was last modified on November 29, 2021 11:02 am
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…