టాలీవుడ్‌లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు కరువవుతున్నారు. కాజల్, నయనతార, శ్రియ లాంటి వారయితేనే సీనియర్ స్టార్స్‌కి సరైన జోడీలుగా కనిపిస్తున్నారు. దాంతో పదే పదే వారినే రిపీట్ చేయడం జరుగుతోంది. వారు సెట్ కాకపోతే తగిన హీరోయిన్‌ని వేటాడ్డం కాస్త కష్టమే అవుతోంది. ‘అఖండ’లో హీరోయిన్ కోసం వెతికి వెతికి అలసిపోయి చివరికి ఫామ్‌లో లేని ప్రగ్యను ఫిక్స్ చేశాడు బోయపాటి. తన సినిమా నుంచి కాజల్ తప్పుకోవడంతో నాగార్జునకి కూడా సేమ్ ప్రాబ్లెమ్ ఎదురయ్యింది.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు నాగార్జున. షూటింగ్ కూడా కొంత ముగిసింది. అంతలో ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ సడెన్‌గా తప్పుకోవడంతో మరో హీరోయిన్ కోసం సెర్చ్ స్టార్టయ్యింది. అమలాపాల్‌ని ఫిక్స్ చేశారనే వార్తలు వచ్చాయి. కానీ రెమ్యునరేషన్ ఇష్యూస్‌తో ఆమె కూడా సైడైపోయిందని తెలిసింది. దాంతో మళ్లీ మరో హీరోయిన్‌ని వెతికే పనిలో పడింది టీమ్. ఆ క్రమంలో మెహ్రీన్ పేరు తెరమీదికొచ్చింది. ఆమెనే కన్‌ఫర్మ్ చేసినట్లు ఇప్పుడు తెలుస్తోంది.
నిజానికి మెహ్రీన్ కూడా మొదట ఎక్కువే డిమాండ్ చేసిందనే గుసగుసలు వినిపించాయి. అయినా చివరికి ఆమెనే ఓకే చేశారని, ప్రస్తుతం ‘ఎఫ్3’ షూట్‌లో పాల్గొంటున్న ఆమె, త్వరలో ఈ షూట్‌లోనూ జాయినవుతుందనేది లేటెస్ట్ టాక్. అదే కనుక నిజమైతే మెహ్రీన్ పంట పండినట్టే. ఎందుకంటే ఇంతవరకు అందరూ యంగ్ హీరోలతోనే నటించిందామె. మొట్టమొదటిసారి స్టార్ హీరోతో జోడీ కడుతోంది. పైగా కొన్ని రోజులుగా చెప్పుకోదగ్గ విజయాలు కూడా లేవు తనకి. ప్రవీణ్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి మెహ్రీన్ ఖాతాలో మంచి హిట్ పడే చాన్స్ లేకపోలేదు.
This post was last modified on November 28, 2021 2:42 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…