టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఇంట తీవ్ర విషాదం ఏర్పడింది. శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు ఈ రోజు తెల్లవారుఝామున 4గంటలకు తుది శ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కందుపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణారావు మృతితో శ్రీను వైట్ల కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
కృష్ణారావు అంత్యక్రియలు ఈ రోజు కందులపాలెంటో జరగనున్నట్లు తెలుస్తోంది. కృష్ణారావుకు శ్రీనువైట్లతోపాటు ఒక కుమార్తె ఉన్నారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు….శ్రీను వైట్లకు ఫోన్ చేసి తమ సంతాపం తెలిపారు. కృష్ణారావు ఆత్మకు శాంతిచేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
శ్రీనువైట్ల ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ఢీ చిత్రం సీక్వెల్…‘ఢీ అంటే ఢీ’ని తెరకెక్కిస్తున్నారు. 2011లో దూకుడు, 2013లో బాద్షా వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన శ్రీను వైట్ల…ఆ తరువాత ఆ స్థాయి హిట్ అందుకోలేదు. చివరగా మూడేళ్ల క్రితం రవితేజతో `అమర్ అక్బర్ ఆంటోనీ` చిత్రాన్ని రూపొందించిన శ్రీను వైట్ల…ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఢీ అంటే ఢీ చిత్రం చేస్తున్నారు.
This post was last modified on November 28, 2021 12:48 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…