Movie News

సమంత.. బోల్డెస్ట్ రోల్

సమంత కెరీర్లో పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతే బోల్డ్ రోల్స్ ఎక్కువగా చూస్తున్నాం. ఎప్పుడూ లిప్ లాక్ చేయని ఆమె ‘రంగస్థలం’లో ఆ లోటు తీర్చేసింది. ఐతే ఆ లిప్ లాక్ ఒరిజినల్ కాదు.. విజువల్ ఎఫెక్ట్స్ మాయ అని అన్నారు అప్పట్లో. ఇది పక్కన పెడితే.. ‘సూపర్ డీలక్స్’ సినిమాలో పెళ్లి తర్వాత తన పాత లవర్‌తో శారీరక సంబంధం పెట్టుకునే అమ్మాయిగా ఇంకో బోల్డ్ రోల్ చేసింది. దానికి తమిళంలో మంచి రెస్పాన్సే వచ్చింది.

ఇక ఈ మధ్యే విడుదలైన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో సమంత ఎంత బోల్డ్‌గా నటించిందో తెలిసిందే. అందులో ఆమె చేసిన కొన్ని ఇంటిమేట్ సీన్లు చూసి జనాలు షాకైపోయారు. నాగచైతన్య నుంచి సమంత విడిపోవడానికి ఈ సీన్లను కూడా కారణంగా చూపించిన వాళ్లు లేకపోలేదు. ఐతే అలాంటి కారణాలకు ఇద్దరూ విడిపోయారంటే వినడానికి సిల్లీగా ఉంటుంది.

ఆ సంగతలా వదిలేస్తే.. వివాహ బంధం నుంచి బయటికి వచ్చేశాక సినిమాల్లో మరింత బిజీ అవడానికి, బోల్డ్ రోల్స్ చేయడానికి సమంత రెడీ అవుతున్నట్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్టుకు సైన్ చేసిందని.. అందులో నెవర్ బిఫోర్ రోల్ చేయబోతోందని.. ఇది సమంత కెరీర్లోనే బోల్డెస్ట్ రోల్ అని అంటున్నారు.

‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ పేరుతో తెరకెక్కనున్న ఈ ఇంగ్లిష్ మూవీలో సమంత బై సెక్సువల్ పాత్ర చేయనుందట. అంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలతోనూ శృంగారం నెరిపే క్యారెక్టర్ అనమాట అది. ఫిలిప్ జాన్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. గురు ఫిలిమ్స్ బేనర్ మీద సునీత తాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. సమంత ‘ఓ బేబీ’ చిత్రానికి ఆమె సహ నిర్మాత. బేసిగ్గా ఇంగ్లిష్‌లో సినిమా తీసి ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారట. ఈ రోల్‌తో సమంత సంచలనం రేపడం ఖాయమంటున్నారు.

This post was last modified on November 26, 2021 10:48 am

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

12 minutes ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

2 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

2 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

2 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

6 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

6 hours ago