‘కేజీఎఫ్’ అనే ఒకే ఒక్క సినిమాతో సౌత్ ఇండియాలో హాట్ షాట్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు ప్రశాంత్ నీల్. అతడితో పని చేయడానికి దక్షిణాదిన అన్ని భాషల సూపర్ స్టార్లూ అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఐతే మార్కెట్ పరంగా తిరుగులేని స్థాయిలో ఉన్న టాలీవుడ్ స్టార్లతోనే అతను వరుసగా సినిమాలు కమిటవుతున్నాడు.
ఇప్పటికే ప్రభాస్‌తో ‘సలార్’ చేస్తున్న ప్రశాంత్.. జూనియర్ ఎన్టీఆర్‌తోనూ ఓ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా అల్లు అర్జున్, రామ్ చరణ్‌లతోనూ ప్రశాంత్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్య చిరు, చరణ్‌లను ప్రశాంత్ కలిసినప్పటి ఫొటో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ ఇద్దరిలో ప్రశాంత్ ఎవరితో సినిమా చేస్తాడు.. అది ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో ఎలాంటి స్పష్టతా రాలేదు.
ఐతే ఇప్పుడు ప్రశాంత్, చరణ్ సినిమా ఓకే అయిపోయిందని.. ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయని మళ్లీ ప్రచారం మొదలైంది. ఓ బాలీవుడ్ మీడియా సంస్థ దీని గురించి రిపోర్ట్ చేయడం విశేషం. ఇద్దరి మధ్య కొంత కాలంగా కథా చర్చలు జరుగుతున్నాయని.. ప్రశాంత్ రెండు స్టోరీ లైన్స్ చెప్పగా.. అవి రెండూ చరణ్‌కు నచ్చాయని అంటున్నారు.
అందులో ఒకటి ఫ్రాంఛైజ్ లాగా చేయడానికి అవకాశమున్న యాక్షన్ స్టోరీ అని.. దాని పట్లే చరణ్ ఎక్కువ ఎగ్జైటెడ్‌గా ఉన్నాడని సమాచారం. ప్రశాంత్‌తో యాక్షన్ మూవీ.. పైగా ఫ్రాంఛైజ్ ఫిలిం అనగానే అది ‘కేజీఎఫ్’ తరహాలో ఉంటుందని భావించవచ్చు. సౌత్‌లో తిరుగులేని మాస్ హీరోల్లో ఒకడైన చరణ్.. ప్రశాంత్ శైలిలో పక్కా యాక్షన్ ఫిలిం చేస్తే దాని రేంజే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. అందులోనూ ‘ఆర్ఆర్ఆర్’, శంకర్ సినిమాలతో చరణ్ రేంజ్ ఇంకా పెరిగాక ప్రశాంత్‌తో జట్టు కడితే ఆ సినిమాకు మామూలు క్రేజ్ ఉండదు.
This post was last modified on November 25, 2021 4:08 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…