మరో సినిమా సైన్ చేసిన రజినీకాంత్!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల ‘అన్నాత్తే’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా ‘పెద్దన్న’ అనే పేరుతో తెలుగులో విడుదలైంది. తెలుగులో ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ.. తమిళంలో మాత్రం భారీ వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో లాస్ట్ సినిమా అని.. ఆయన సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది.

రీసెంట్ గా రజినీకాంత్ మరో సినిమా సైన్ చేసినట్లు సమాచారం. ‘అన్నాత్తే’ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ తో రజినీకాంత్ కి ఓ అగ్రిమెంట్ ఉందట. అదే బ్యానర్ లో మరో సినిమా చేయడానికి తలైవా ఓకే చెప్పారట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడు కూడా సెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట.

పాండిరాజ్ స్క్రిప్ట్ రజినీకాంత్ కి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే ‘అన్నాత్తే’ సినిమాను డైరెక్ట్ చేసిన శివ.. రజినీకాంత్ తో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. పాలిటిక్స్ నుంచి తప్పుకున్న రజినీకాంత్ ఇప్పుడు పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు.