శివశంకర్ మాస్టర్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో 80వ దశకంతో మొదలుపెట్టి ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన లెజెండరీ డ్యాన్స్ మాస్టర్ ఆయన. మగధీర సినిమాలో ధీర ధీర పాటకు నృత్య దర్శకత్వం వహించింది ఆయనే అని, దీనికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారని చాలామందికి తెలియదు.
శివశంకర్ డ్యాన్స్ మాస్టర్‌గా కంటే ఆట షోలో జడ్జిగా ఎక్కువ పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత ఎన్నో షోల్లో ఆయన పాల్గొన్నారు. సినిమాల్లోనూ నటించారు. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉండే శివశంకర్ మాస్టర్ ఇప్పుడు విషమ స్థితిలో ఆసుపత్రి మంచపై ఉన్నారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. కొన్ని రోజుల కిందటే పాజిటివ్‌గా తేలిన ఆయన ఇంటిపట్టునే ఉండి కోలుకునే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి విషమించింది.
దీంతో శివశంకర్‌ను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చాయి. కొవిడ్ వల్ల పరిస్థితి విషమిస్తే భారీగా ఖర్చవుతుందన్న సంగతి తెలిసిందే.
శివశంకర్ కుటుంబం భరించలేని స్థాయిలో ఆసుపత్రి ఖర్చు ఉండటం, ఆయన్ని కాపాడుకోవాలన్న తాపత్రయంతో కుటుంబ సభ్యులు సాయం అర్థిస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలోనూ అప్పీల్ ఇచ్చారు. తన తండ్రిని బతికించుకునేందుకు దాతలు సాయం అందించాలని శిశంకర్ కొడుకు అజయ్ కృష్ణ (మొబైల్ నంబర్ 9840323415) అభ్యర్థిస్తున్నాడు. సినీ పరిశ్రమ నుంచి సాయం కోసం శివశంకర్ మాస్టర్ కుటుంబం ఎదురు చూస్తోంది. ఆయన త్వరగా కోలుకుని మామూలు మనిషి కావాలని ఆశిద్దాం.
This post was last modified on November 25, 2021 10:42 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…