ప్రస్తుతం టాలీవుడ్ అనే కాక ఇండియాలోనే అత్యంత బిజీగా ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. తెలుగులో ఎఫ్3, శాకుంతలం, హిందీలో జెర్సీ, ఎఫ్-2, హిట్ రీమేక్స్.. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ.. ఇవీ ఆయన ప్రస్తుతం నిర్మిస్తున్న చిత్రాలు. ఇంకా విజయ్ హీరో ఓ ద్విభాషా చిత్రం లైన్లో ఉంది. ప్రభాస్, అల్లు అర్జున్‌లతోనూ ఆయనకు కమిట్మెంట్లు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలనూ భారీ స్థాయిలోనే రాజు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు రాజు చేతికి ఒక మెగా ప్రాజెక్టు అనుకోకుండా వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ సినిమాకు దర్శకుడు రాజమౌళి కాగా.. హీరో మహేష్ బాబు. అదేంటి ఈ కాంబినేషన్లో సినిమాను సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ కదా నిర్మిస్తోంది అన్న సందేహం రాకుండా ఉండదు. అది నిజమే కానీ. ఈ ప్రాజెక్టులో రాజు కూడా భాసగ్వామి అవుతున్నాడనది తాజా సమాచారం.
కేఎల్ నారాయణ సినిమా నిర్మాణం పక్కన పెట్టేసి చాలా ఏళ్లయింది. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో బిజీ అయిపోయారు. కాకపోతే తాను నిర్మాగా యాక్టివ్‌గా ఉన్న సమయంలో తనకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రాజమౌళి ఇప్పుడు సినిమా చేయడానికి ముందుకు రావడంతో మళ్లీ దుర్గా ఆర్ట్స్ దుమ్ము దులుపుతున్నారు. ఐతే ఆయన సినిమాలు చేసే టైంకి, ఇప్పటికి మొత్తం వ్యవహారం మారిపోయింది. ప్రొడక్షన్ అనే కాక సినిమా బిజినెస్, డిస్ట్రిబ్యూషన్ అంతా మారాయి. దీనికి తోడు సినిమాకు బడ్జెట్ కూడా వందల కోట్లలో పెట్టాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో తానొక్కడినే ఈ సినిమాను హ్యాండిల్ చేయడం కష్టమన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ పరంగా తిరుగులేని స్థాయిలో ఉన్న దిల్ రాజును ఈ ప్రాజెక్టులోకి ఆహ్వానించాడట నారాయణ. రాజమౌళి-మహేష్ కాంబినేషన్లో సినిమాలో భాగస్వామి అవమంటే రాజు ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాడు. వెంటనే ఓకే చెప్పేశాడని.. ఆయన కూడా ఈ ప్రాజెక్టులో పార్టనర్ అనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు.
This post was last modified on November 24, 2021 1:32 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…