యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మధ్యనే అమెరికాకు వెళ్లి ఇండియా తిరిగొచ్చారు కమల్. ఆ తరువాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దగ్గు బాగా వస్తుండడంతో పరీక్షలు చేయించారు. అందులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.
తమిళంలో ట్వీట్ చేసిన ఆయన.. అమెరికా నుంచి తిరిగొచ్చిన తరువాత దగ్గు, జలుబు వచ్చిందని, దీంతో వెంటనే టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలిందని.. ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు చెప్పారు. పాండమిక్ ప్రభావం ఇంకా తగ్గలేదని.. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ రిక్వెస్ట్ చేశారు.
విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్ అమెరికాలో బట్టల బిజినెస్ మొదలుపెట్టారు. తన బ్రాండ్ క్లాత్ ఓపెనింగ్ వేడుకలో భాగంగా అమెరికాకు వెళ్లారు. ఇక సినిమాల విషయానికొస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్నారు కమల్ హాసన్. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates