నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. గత రెండేళ్లలో ఆయన నటించిన సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో ప్రేక్షకులను థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతున్నారు నాని. ప్రస్తుతం ఈ హీరో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తి కాకుండానే.. ‘దసరా’ అనే మరో సినిమాను మొదలుపెట్టారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చింది. ఈ సినిమా పోస్టర్ లో నాని రగ్డ్ లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు.
తొలిసారి నాని ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారు. సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో హీరోతో పాటు అతడి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుందట. సినిమాకి ఆ పాత్ర చాలా కీలకమని చెబుతున్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు ఈ ఫ్రెండ్షిప్ బాండ్ మీదే ఉంటాయని సమాచారం. దీంతో ఆ పాత్రలో మరో యంగ్ హీరోని తీసుకుంటేనే కరెక్ట్ అని చిత్రబృందం భావిస్తోంది.
దీనికోసం ఇప్పటికే పేరున్న ఇద్దరు హీరోలను సంప్రదించారట. వారిద్దరిలో ఎవరైనా ఓకే చెబితే.. సినిమాకి మరో ఎట్రాక్షన్ యాడ్ అవుతుందని భావిస్తున్నారు. మరి నానితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏ హీరో ముందుకొస్తారో చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ కనిపించనుంది. అలానే సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమా మ్యూజిక్ అందించనున్నారు.
This post was last modified on November 22, 2021 2:48 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…