టాలీవుడ్లో ఐటెం సాంగ్‌లకు ఒక స్థాయి తీసుకొచ్చిన ఘనత సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ జోడీకే దక్కుతుంది. సుకుమార్ ఎలాంటి సినిమా తీసినా సరే.. అందులో ఒక ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ‘1 నేనొక్కడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్ మూవీలో సైతం ఐటెం సాంగ్ పెట్టాడంటే సుకుమార్‌కు ఆ తరహా పాటలపై ఉన్న మక్కువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అది ఆయనకో సెంటిమెంటు లాగా మారిపోయింది. సుకుమార్ కొత్త చిత్రం ‘పుష్ప’లో సైతం సుక్కు ఈ సెంటిమెంటును కొనసాగిస్తున్నాడు.
ఇప్పటికే ‘పుష్ప’ నుంచి నాలుగు పాటలు రిలీజ్ కాగా.. వేటికవే మంచి ఆదరణ తెచ్చుకున్నాయి. ఇప్పుడు యూట్యూబ్‌లో ఆ పాటలు మోత మోగించేస్తున్నాయి. టీవీ షోల్లో ఎక్కువగా ఈ పాటలనే పెర్ఫామ్ చేస్తుండటం అవి ఏ స్థాయిలో ఆదరణ పొందాయో చెప్పడానికి రుజువు. సినిమాలో మొత్తం ఉన్నవి ఐదు పాటలు కాగా.. ఇక మిగిలింది ఐటెం సాంగే.
‘పుష్ప’ ఐటెం సాంగ్‌లో సమంత మెరవబోతుండటం తెలిసిన విషయమే. ఈ నెల 26న రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట చిత్రీకరణ మొదలు కాబోతోంది. నాలుగు రోజుల పాటు దీన్ని షూట్ చేస్తారని సమాచారం. టాకీ పార్ట్‌తో పాటు మిగతా పాటల చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాడు సుక్కు. ఈ పాట అవ్వగానే గుమ్మడికాయ కొట్టేయబోతున్నాడు. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం సుక్కు-దేవి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ఐటెం సాంగ్స్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ పాట ఉంటుందట.
వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన పాటల్లో మాదిరే ఇందులో ఒక కాన్సెప్ట్ ఉంటుందట. పాట మొత్తం ఐటెం గర్ల్ కొంటెగా ప్రశ్నలు సంధిస్తూ వెళ్లేలా ఈ పాటను రాశారట చంద్రబోస్. ఒక ప్రశ్న సంధించి.. ‘ఊ అంటావా.. ఊహూ అంటావా మావా’ అని అడుగుతూ సాగేలా పాట ఉంటుందట. మంచి హస్కీ వాయిస్ ఉన్న సింగర్ ఈ పాట పాడినట్లు సమాచారం. మధ్య వరకు ఒక మోస్తరుగా సాగి.. మంచి ఊపుతో పాట ముగుస్తుందని.. ఈ పాట కచ్చితంగా ఒక సెన్సేషన్ అవుతుందని అంటున్నాయి.
This post was last modified on November 21, 2021 3:41 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…