తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ.. భాష ఏదైనా, సినిమా బాగుంటే చాలు.. దాన్ని వెంటనే పట్టుకుపోయి రీమేక్ చేసేస్తున్నారు బాలీవుడ్ వారు. ఇప్పటికే చాలా సౌత్ రీమేక్స్ అక్కడ సెట్స్ మీద ఉన్నాయి. ఇప్పుడు మరొకటి మొదలవుతోంది. అదే 2017లో రిలీజైన తమిళ సూపర్ హిట్ ‘అరువి’.
అదితి బాలన్ లీడ్ రోల్‌లో అరుణ్ ప్రభు, పురుషోత్తం డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఎన్నెన్నో అవార్డులు కూడా గెల్చుకుంది. అందుకే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. పోయినేడు ఆగస్ట్‌లోనే సెట్స్‌కి వెళ్లాల్సింది. కానీ కరోనా వల్ల లేటయ్యింది. ఇప్పటికి మొదలవుతోంది.
బాలీవుడ్‌లో సెటిలైన తెలుగువాడు, రామ్ గోపాల్ వర్మ శిష్యుడు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘శూల్’ని తీసిన ఇ.నివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అదితి బాలన్ చేసిన పాత్రలో ఫాతిమా సనా షేక్ కనిపించబోతోంది.
‘దంగల్’ మూవీలో ఆమిర్ ఖాన్ కూతురిగా, స్పోర్ట్స్ పర్సన్‌గా చక్కగా నటించి మార్కులు కొట్టేసింది ఫాతిమా. అయితే దానివల్ల అద్భుతమైన ఆఫర్స్ ఏమీ వరించలేదు. చేసిన కొన్ని సినిమాలతో పేరూ రాలేదు. ఆమిర్‌తో రిలేషన్‌లో ఉందనే వార్తలతో పాపులర్ అయినంతగా తన కెరీర్ రిలేటెడ్ న్యూస్‌తో అవ్వలేదామె. కానీ ఇప్పుడీ సినిమాతో దశ తిరుగుతుందని, నటిగా సెటిలైపోతానని ఆశపడుతోంది.
అయితే ఇదో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ. హీరోయిన్ క్యారెక్టర్ ఎక్సెలెంట్‌గా ఉంటుంది. కాస్త మిస్టీరియస్‌గాను, చాలా ఎమోషనల్‌గాను కూడా ఉంటుంది. అంత హెవీ రోల్‌కి ఫాతిమా ఎంతవరకు న్యాయం చేయగలుగుతుందో మరి.
This post was last modified on November 21, 2021 12:47 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…