మాదకద్రవ్యాల వాడుతున్నారని, దగ్గర పెట్టుకున్నారనే ఆరోపణలపై ఈ మధ్యనే అరెస్టయిన ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఆర్యన్ మాదకద్రవ్యాలు వాడాడని కానీ తన దగ్గర ఉంచుకున్నాడనే కాదు చివరకు వ్యాపారులతో సంబంధాలున్నాయనేందుకు కూడా ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించటం విచిత్రంగా ఉంది. దాదాపు రెండు నెలల క్రితం ఓ క్రూయూజ్ షిప్పులో పార్టీ జరుగుతోందని, అందులో కొందర మాదకద్రవ్యాలు విడుతున్నారనే సమాచారం అందటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడులు చేసిన విషయం తెలిసిందే.
ఎన్సీబీ ఉన్నతాధికారులు జరిపిన దాడుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో పాటు మరికొందరు ఉన్నారు. ఆర్యన్ దగ్గర మాదకద్రవ్యాలు దొరకలేదని అప్పట్లో ఎన్సీబీ అధికారులే చెప్పారు. ఆర్యన్ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం మాదకద్రవ్యాలు దొరికాయన్నారు. అయితే ఆర్యన్ మాదకద్రవ్యాలను తీసుకున్నట్లు ఎన్సీబీ ఆరోపించింది.
ఆ తర్వాత ఈ కేసు విచారణలో ఉండగానే అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యాపారులతో ఆర్యన్ వాట్సప్ చాటింగ్ ను ఎన్సీబీ కోర్టుకు సమర్పించింది. అలాగే కొందరు హీరోయిన్ల మొబైళ్ళలో కూడా మాదకద్రవ్యాల వాడకంపై ఆర్యన్ వాట్సప్ చాటింగ్ బయటపడింది. విచారణ జరుగుతుండగానే ఎన్సీబీ జోనల్ జాయింట్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పై లంచం ఆరోపణలు, ఆయన మతం లాంటి అనేక అంశాలపై నానా గోల జరిగింది. మొదట్లో కోర్టు కూడా ఎన్సీబీ వాదనలతో ఏకీభవించి ఆర్యన్ కు బెయిల్ ను చాలాసార్లే తిరస్కరించింది.
అయితే తర్వాత ఏమైందో ఏమో ఆర్యన్ మొబైల్ వాట్సప్ చాటింగ్ ఆధారాలు కావని కోర్టు చెప్పేసింది. హీరోయిన్లతో ఆర్యన్ మొబైల్ వాట్సప్ చాటింగ్ కూడా సరైన ఆధారాలు కావని కొట్టేసింది. ఫైనల్ గా అసలు ఆర్యన్ మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్లు, రవాణా చేస్తున్నట్లు ఎన్సీబీ ఎలాంటి ఆధారాలను చూపలేకపోయిందని తేల్చేసింది. దాంతో ఆర్యన్ తో పాటు ఆయన మిత్రులకు కూడా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది.
ఆర్యన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎన్సీబీ సాక్ష్యాలను చూపలేకపోయిందని కోర్టు కేసులు కొట్టేయటం గమనార్హం. మొత్తం మీద విచారణలో ఏమి జరిగిందో తెలీదు కానీ ఆర్యన్ మాత్రం కేసుల్లో నుండి క్లీన్ చిట్ తో బయటపడిపోయాడు.
This post was last modified on November 21, 2021 11:07 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…