బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేల తరచూ తన ప్రేమాయణాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. నవ్య సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఆమెకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పటికే ఆమె బాలీవుడ్ నటుడు మీజాన్ జఫ్రీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై మీజాన్ తండ్రి స్పందించారు. వారిద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అలానే మీజాన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో నవ్య తనకు స్నేహితురాలు మాత్రమేనని అన్నారు.
దీంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. తాజాగా మరోసారి నవ్య ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అది కూడా ఓ యంగ్ హీరోతో అన్నట్లుగా బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ‘గల్లీబాయ్’ సినిమాతో నటుడిగా క్రేజ్ సంపాదించుకున్న సిద్ధాంత్ చతుర్వేదితో నవ్య చాలా కాలంగా ప్రేమలో ఉందని సమాచారం. ఇద్దరూ తమ రిలేషన్ ను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కానీ ఈ ప్రేమకథను సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు.
మరి ఈ విషయంపై నవ్య కానీ.. సిద్ధాంత్ కానీ స్పందిస్తారేమో చూడాలి. ప్రస్తుతం సిద్ధాంత్ ‘బంటీ అండ్ బబ్లీ 2’ సినిమాలో నటిస్తున్నారు. ఇక నవ్య నవేలీ సినిమాల్లోకి రాదనే విషయాన్ని పరోక్షంగా చెబుతూనే ఉంది. ఇటీవలే ఆమె బిజినెస్ లోకి ఎంటర్ అయింది. తన ఫ్యామిలీ బిజినెస్ తో పాటు విమెన్ హెల్త్ కి సంబంధించిన ఓ ఫౌండేషన్ లో మెంబర్ గా వ్యవహరిస్తోంది.
This post was last modified on November 20, 2021 10:16 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…