Movie News

బంగార్రాజు జోరు.. సంక్రాంతి పోరు కోసమా!

సంక్రాంతి వస్తోందంటే సాధారణంగా స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజుకి రెడీ అయిపోతాయి. ఒకదాని తర్వాత ఒకరుగా కర్చీఫ్ వేసేస్తాయి. ఈసారి కూడా అదే జరిగింది. కానీ ఎప్పుడైతే ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్’ కూడా ఆ సీజన్‌కే ఫిక్సయ్యిందో.. మిగతావారి లెక్కలు మారిపోయాయి. సర్కారువారి పాట, ఎఫ్‌ 3 తమ డేట్స్ మార్చేసుకున్నాయి. ప్రస్తుతానికి రాధేశ్యామ్, భీమ్లానాయక్ మాత్రమే అనుకున్న తేదీకి ఫిక్సై ఉన్నాయి.

అయితే వీరితో పాటు బంగార్రాజు కూడా సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాడనే వార్త కొద్ది రోజులుగా వినిపిస్తోంది. కాకపోతే ప్యాన్ ఇండియా సినిమాల మధ్యలో ఈ అచ్చ తెలుగు మూవీ పోటీకి వస్తుందా అనే అనుమానం అందరిలోనూ ఉంది. కానీ నాగార్జున దానికే బలంగా ఫిక్సయ్యారనే ప్రచారం జరుగుతోంది. అది నిజమేనేమోనని ఇప్పుడనిపిస్తోంది. ఎందుకంటే వరుస అప్‌డేట్స్‌తో టీమ్ తమ జోరు చూపిస్తోంది.

రీసెంట్‌గా నాగార్జున దేవకన్యలతో ఆడిపాడుతున్న పాటను రిలీజ్ చేశారు. ఆ వెంటనే నాగచైతన్యకి జోడీగా నటిస్తున్న కృతీశెట్టి ఫస్ట్ లుక్‌ను వదిలారు. త్వరలో మరో రెండు అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్టు ఇప్పుడు ప్రకటించారు. ఈ నెల 22న బంగార్రాజు ఫస్ట్ లుక్‌ను, 23న టీజర్‌‌ను రిలీజ్ చేయబోతున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు. ఆల్రెడీ నాగార్జున లుక్‌ని అందరూ చూసేశారు కాబట్టి ఈసారి వచ్చే లుక్ నాగచైతన్యదే కావచ్చు.

ఈ స్పీడ్‌లో అప్‌డేట్స్ ఇస్తున్నారంటే కచ్చితంగా సినిమాని సంక్రాంతి రేసులో నిలబెడతారనే అనిపిస్తోంది. అయినా ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమానే. సంక్రాంతి అంటేనే ఊరు గుర్తొస్తుంది ఎవరికైనా. ఇది అచ్చమైన పల్లెటూరి స్టోరీ. కాబట్టి బంగార్రాజు బరిలోకి దిగాలనుకోవడం తప్పేమీ లేదు. కానీ ఒకేసారి పెద్ద సినిమాలన్నీ వస్తే థియేటర్లకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మహేష్‌ బాబు లాంటి స్టార్ హీరో సినిమా సైతం పక్కకి తప్పుకుంది. మరి ఆ సమస్య బంగార్రాజుకి మాత్రం రాదా అనేదే ప్రశ్న.

This post was last modified on November 20, 2021 11:48 am

Share
Show comments

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

8 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

9 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

12 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

12 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

13 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

13 hours ago