నందమూరి కుటుంబ హీరోల్లో ఏ ఇద్దరు ఒక చోట కలిసి కనిపించినా అందరూ ప్రత్యేక ఆసక్తితో చూస్తారు. కారణాలేవైనా కానీ.. నందమూరి కుటుంబ హీరోల్లో ఉండాల్సినంత సఖ్యత లేదన్నది వాస్తవం. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. ఏవో కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే దూరం దూరంగానే ఉన్నారు. గతంలో కళ్యాణ్ రామ్.. బాలయ్యకు దగ్గరగా ఉండేవాడు. తారక్‌కు, కళ్యాణ్‌కు అంత సాన్నిహిత్యం కనిపించేది కాదు. తర్వాత పరిస్థితులు మారాయి. అన్నదమ్ములిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. బాలయ్యకు, తారక్‌కు దూరం ఇంకా ఇంకా పెరిగింది.
మూడేళ్ల కిందట హరికృష్ణ చనిపోయినపుడు.. అరవింద సమేత సక్సెస్ మీట్లో బాలయ్య, తారక్ కలిసి కనిపించారు. ఆ తర్వాత ‘యన్.టి.ఆర్’ సినిమా వేడుకలో తారక్ పాల్గొన్నాడు. తర్వాత ఇద్దరూ దూరం దూరంగానే ఉన్నారు. సినిమా పరంగానే కాక వేరే రకమైన వేడుకల్లో కూడా కలిసి కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి.
ఐతే చాన్నాళ్ల తర్వాత బాబాయ్-అబ్బాయ్ కలిసి ఒకే వేదికలో కనిపించనున్నట్లుగా ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది. బాలయ్య కొత్త చిత్రం ‘అఖండ’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు తారక్ అతిథిగా రాబోతున్నాడట. తారక్ సినిమాకు బాలయ్య ముఖ్య అతిథి అంటే ఒక లెక్క కానీ.. బాలయ్య చిత్రానికి తారక్ చీఫ్ గెస్ట్ అంటే అది కచ్చితంగా పెద్ద చర్చనీయాంశమే. ఈ వేడుకలో నేచురల్ స్టార్ నాని కూడా పాల్గొంటాడని కూడా వార్తలొస్తున్నాయి. నాని ఇటీవలే బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకు అతిథిగా రావడం తెలిసిందే.
ఐతే క్రేజీగా ఉంటుందని ఊరికే తారక్, నాని.. బాలయ్య సినిమాకు గెస్ట్స్ అని సోషల్ మీడియాలో జనాలు ప్రచారం సాగిస్తున్నారా.. లేక నిజంగానే వీళ్లిద్దరూ ఈ వేడుకలో పాల్గొంటారా అన్నది చూడాలి. ఈ నెల 27న ‘అఖండ’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 20, 2021 12:07 am
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…