ఇంకో ఐదు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది విక్టరీ వెంకటేష్ మూవీ ‘దృశ్యం-2’. మలయాళంలో ఇదే పేరుతో తెరకెక్కిన ‘దృశ్యం’ సీక్వెల్‌కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే రిలీజ్ ముంగిట ఈ చిత్రానికి లీగల్ సమస్యలు తలెత్తినట్లు సమాచారం. గుట్టుగా సమస్యను పరిష్కరించుకోవడమో లేక రిలీజ్ ఆపేయడమో చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘దృశ్యం-2’ చిత్రం ఓటీటీ రిలీజవుతుందన్న సమాచారం చాలా రోజుల ముందే బయటికి వచ్చింది.
ఐతే అప్పుడు ఆ చిత్రాన్ని డిస్నీ+హాట్ స్టార్ వాళ్లు కొన్నట్లుగా వార్తలొచ్చాయి. మీడియాలో కొన్ని రోజుల పాటు హాట్ స్టార్ పేరే వినిపించింది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి అమేజాన్ ప్రైమ్ పేరు తెరపైకి వచ్చింది. ‘దృశ్యం-2’ ఒరిజినల్‌ను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసిన ప్రైమ్ వాళ్లే మళ్లీ తెలుగు ‘దృశ్యం-2’ను కూడా విడుదల చేస్తుండటం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఐతే ప్రిమియర్స్ డేట్ ఇచ్చేసి ప్రమోషన్లు మొదలుపెట్టడంతో సినిమా వీక్షణకు అంతా రెడీ అయిపోయారు. కానీ ఇప్పుడు హాట్ స్టార్ సంస్థ లైన్లోకి వచ్చింది. ముందు తమతో డీల్ చేసుకుని.. దాన్ని క్యాన్సిల్ చేయకుండానే మధ్యలో ప్రైమ్‌కు వెళ్లిపోవడం పట్ల ఆ సంస్థ ఆగ్రహంతో ఉందని, దీనిపై లీగల్ నోటీసులు ఇచ్చిందని సమచారం.
‘దృశ్యం-2’కు సంబంధించి సురేష్ బాబుతో పాటు ఇంకో ఇద్దరు నిర్మాతలు ఉండగా.. వారిలో ఒకరు హాట్ స్టార్ వాళ్లతో డీల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ డీల్ సంగతి ఎటూ తేలకముందే తన ప్రొడక్షన్లో వచ్చిన మరో చిత్రం ‘నారప్ప’ సినిమాను రిలీజ్ చేసిన ప్రైమ్ వాళ్లతో సురేష్ బాబు ‘దృశ్యం-2’ విడుదలకు ఒప్పందం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో హాట్ స్టార్ వాళ్లకు మండిపోయి లీగల్ ఫైట్‌కు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. రిలీజ్‌కు ఇంకో ఐదు రోజులే ఉండగా ఈ సమస్యను సురేష్ బాబు ఎలా పరిష్కరిస్తారో.. సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో చూడాలి.
This post was last modified on November 19, 2021 10:01 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…