డిఫరెంట్ కాన్సెప్టులు తప్ప రొటీన్ సినిమాలు చేయడానికి ఇష్టపడడు శ్రీవిష్ణు. హీరోయిజం కోసం పాకులాడకుండా.. తన ఇమేజ్కి తగ్గ పాత్రల్నే ఎంచుకుంటాడు. అలాగని ఏదో ఒక కథ కాకుండా కాస్తో కూస్తో కొత్తగా ఉండేవే సెలెక్ట్ చేసుకుంటాడు. అందుకే నటుడిగా తనకి మంచి పేరుంది. తేజ మార్ని డైరెక్షన్‌లో చేస్తున్న ‘అర్జున ఫల్గుణ’ సినిమా కూడా శ్రీవిష్ణు స్టైల్లోనే డిఫరెంట్‌గా కనిపిస్తోంది.
రీసెంట్‌గా ఈ మూవీ టీజర్, సాంగ్ రిలీజయ్యాయి. అవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. శ్రీవిష్ణు గత సినిమాలను మించి ఈ మూవీ అప్‌డేట్స్ వైరల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే దానికి కారణం ఎన్టీఆర్ అభిమానులే అంటున్నారు ఇండస్ట్రీ వారు. శ్రీవిష్ణు సినిమాకి, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి లింకేంటా అనేగా! ఉంది. ఈ మూవీలో ఎన్టీఆర్‌కి వీరాభిమానిగా నటిస్తున్నాడు శ్రీవిష్ణు. తన సినిమాల రిలీజులకి హడావుడి చేయడం, కటౌట్లకి అభిషేకాలు చేయడం లాంటి సీన్లు కూడా ఉన్నాయట. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ పేరు కూడా వాడతాడట.
ఈ విషయాలన్నీ బయటికి రావడం, షూటింగ్ సమయంలోని కొన్ని ఫొటోలు కూడా లీక్ అవడంతో ఈ మూవీపై ఎన్టీఆర్ అభిమానుల దృష్టి పడింది. తమ ఫేవరేట్ హీరో ప్రస్తావన ఉన్న సినిమా కాబట్టి బాగా ప్రమోట్ చేయాలని వాళ్లు డిసైడ్ అయ్యారట. అందుకే ఈ మూవీ నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా వైరల్ చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. మరి ఎన్టీఆర్ సెంటిమెంట్ సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.
This post was last modified on November 17, 2021 2:44 pm
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…