ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇచ్చే ‘నంది’ అవార్డులను సినీ జనాలు ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావించేవారో తెలిసిందే. సినిమా విజయం సాధిస్తే ఎంత ఆనందపడేవారో.. నంది అవార్డులొస్తే దానికి మించిన ఆనందం కనిపించేది. నంది పురస్కారం సాధిస్తే దాన్ని కెరీర్లోనే గొప్ప ఘనతగా భావించేవారు. కానీ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోగానే పరిస్థితులు మారిపోయాయి.
సినీ పరిశ్రమకు కేంద్రమైన హైదరాబాద్ ఉన్నది తెలంగాణలో. ఐతే ఇక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం నంది అవార్డుల గురించి ఏమీ పట్టనట్లు ఉండిపోయింది. ఒక సందర్భంలో నంది అవార్డుల గురించి విలేకరులు అడిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తేలిక చేసి మాట్లాడారు. ఆయన ప్రభుత్వం ఈ అవార్డులను అస్సలు పట్టించుకునే పరిస్థితి లేదు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నేళ్ల గ్యాప్ తర్వాత నంది అవార్డులను ప్రకటించింది కానీ.. అందులో పక్షపాతం ప్రదర్శించారన్న విమర్శలు రావడంతో తర్వాతి ఏడాది అవార్డులను ఆపేసింది. ఇక ఆ తర్వాత నంది పురస్కారాల ఊసే లేకపోయింది.
ప్రతి రాష్ట్రం తమ సినీ కళాకారుల ప్రతిభను గుర్తించి పురస్కారాలు అందిస్తోంది కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినీ జనాలకు ఇందుకు నోచుకోవడం లేదు. ఒకటీ అరా వచ్చే జాతీయ అవార్డుల వైపు ఆశగా చూస్తున్నారు. ఫిలిం ఫేర్, సైమా లాంటి అవార్డులతో సంతృప్తి పడుతున్నారు. దీని పట్ల మెగాస్టార్ చిరంజీవి కొంత ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నంది అవార్డులను ఆపేయడం బాధాకరమంటూ ఒక ప్రైవేటు అవార్డుల వేడుకలో చిరు బాధ పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పురస్కారాలను సినీ కళాకారులు చాలా ప్రత్యేకంగా భావిస్తారని.. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి.. పురస్కారాలు అందించి ప్రోత్సహించాలని ఆయన కోరారు.
This post was last modified on November 17, 2021 12:35 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…