నేచురల్ స్టార్ నాని తన సినిమాను సోలోగా రిలీజ్ చేసుకోవాలని అందరికంటే ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు పోటీ పడక తప్పేలా లేదు. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు నాని. అప్పటికి ‘పుష్ప’ వచ్చి వారం రోజులు దాటేస్తుంది కాబట్టి తన సినిమాకు కలెక్షన్స్ పరంగా సమస్య ఉండదని భావించారు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్.. నానికి పోటీగా రంగంలోకి దిగుతున్నారు.
ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ వరుణ్ తేజ్ ‘గని’ సినిమా తాజాగా మరో కొత్త డేట్ అనౌన్స్ చేసింది. సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తూ.. డిసెంబర్ 24న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అదే రోజున రావాలనుకున్న నాని.. తన సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశాడు. కానీ ఇప్పుడు పోటీగా వరుణ్ సినిమా వస్తుంది. గతేడాది నాని నటించిన ‘వి’ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.
ఈ ఏడాది ‘టక్ జగదీష్’ కూడా అలానే చేశారు. క్రేజ్ ఉన్న హీరో రెండు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఓటీటీలో రిలీజ్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్ల నుంచి విమర్శలు వచ్చాయి. ఒకానొక సమయంలో నాని సినిమాలను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు కూడా. దీంతో తన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను థియేటర్లో భారీ ఎత్తున రిలీజ్ చేసి విమర్శకులకు సమాధానం చెప్పాలనుకున్నారు నాని. అందుకే అందరికంటే ముందుగానే క్రిస్మస్ కి తన సినిమా వస్తుందని చెప్పారు.
కానీ ఇప్పుడు నానికి సోలోగా రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వడం లేదు మెగాహీరో వరుణ్ తేజ్. ఒకేరోజు ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. కలెక్షన్స్ ను షేర్ చేసుకోక తప్పదు. మరి ఈ విషయంలో ఎవరైనా తగ్గుతారేమో చూడాలి!
This post was last modified on November 15, 2021 4:08 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…