మాల్దీవుల్లో పూజా మంటలు


టాలీవుడ్లో పూజా హెగ్డే.. కోలీవుడ్లో పూజా హెగ్డే.. బాలీవుడ్‌లోనూ పూజా హెగ్డే.. ఇండియా మూడు మేజర్ ఫిలిం ఇండస్ట్రీల్లో ఈ ముంబయి భామదే హవా. వరుసగా భారీ విజయాలందుకుంటూ.. సినిమా సినిమాకూ క్రేజ్, ఫాలోయింగ్ పెంచుకుంటూ తనకు ఎదురు లేదని చాటుతోంది పూజా. ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి యావరేజ్ మూవీ కూడా హిట్ అయిందంటే అందుకు ముఖ్య కారణం పూజానే. దీని కంటే ముందు ఆమె అందుకున్న భారీ విజయాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

ప్రస్తుతం తెలుగులో ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య లాంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయబోతోంది. తమిళంలో విజయ్ సరసన ‘బీస్ట్’ లాంటి భారీ చిత్రంలో నటిస్తోంది. హిందీలో ‘సర్కస్’ అనే పెద్ద సినిమాలో ఆమే కథానాయిక.

వివిధ భాషల్లో ఇలా తీరిక లేకుండా నటిస్తున్న పూజా.. లేక లేక విరామం తీసుకుంది. సేదదీరేందుకు మాల్దీవులకు వెళ్లిపోయింది. తోడుగా ఎవరెళ్లారో ఏంటో కానీ.. పూజా మాత్రం అక్కడ భలేగా ఎంజాయ్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న తన ఫొటోలు, వీడియోలే అందుకు నిదర్శనం. బికినీ వేసుకుని చాలా సెక్సీగా కనిపిస్తూ వాటర్లో డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను పూజానే స్వయంగా షేర్ చేసింది. ఇలాంటి అసాధారణమైన అనుభవాలను ఆస్వాదిస్తున్న సాధారణ అమ్మాయి తాను అని ఆమె కామెంట్ కూడా పెట్టింది.

ఇక బికినీలో ఒక రిసార్ట్ ముందు పూజా స్టెప్పులేస్తున్న చిన్న వీడియో ఒకటి ట్విట్టర్లో తెగ తిరిగేస్తోంది. అందులో పూజా సూపర్ సెక్సీగా కనిపిస్తోంది. కరోనా టైంలో ఇలా హీరోయిన్లు చాలామంది మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేసిన వాళ్లే. అక్కడి రిసార్టులు సెలబ్రెటీలకు హాలిడే ప్యాకేజీలను ఉచితంగా ఆఫర్ చేసి.. వాళ్ల ప్రమోషన్‌తో పర్యాటకులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.