టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. చైతుతో పెళ్లి తరువాత ఇండస్ట్రీలో మరింత రెస్పెక్ట్ పొందారు. నటిగానే కాకుండా.. అక్కినేని వారి కోడలుగా బాగా పాపులర్ అయ్యారు. రీసెంట్ గా తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. అయితే సమంత డిప్రెషన్ లోకి వెళ్లింపోతుందేమో, సినిమాలు తగ్గించేస్తుందేమోనని అభిమానులు కలవరపడ్డారు. కానీ సమంత ఎన్నడూలేని విధంగా వరుస సినిమాలు ఒప్పుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు.
కెరీర్ పరంగా బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నారు సమంత. ఈ క్రమంలో తన వద్దకు వస్తోన్న స్క్రిప్ట్ లలో నచ్చిన కథలన్నీ ఒప్పేసుకుంటున్నారు. ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేస్తోన్న సమంత.. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా, అలానే ఓ బైలింగ్యువల్ సినిమా చేయనున్నారు. బాలీవుడ్ లో కూడా సినిమా ఒప్పుకున్నారని టాక్. ఇదిలా ఉండగా.. ఈసారి ఏకంగా ఇంటెర్నేషనల్ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
తెలుగులో ‘ఓ బేబీ’ అనే సినిమాను నిర్మించిన సునీత తాటి.. ఓ ఇంటెర్నేషనల్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ప్రముఖ రచయిత తిమెరి ఎన్ మురారి రాసిన ‘The arrangements of love’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమాకు టైటిల్ గా ఇదే పేరుని ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమా షూటింగ్ కొంతభాగం ఇండియాలో, మిగిలిన షూటింగ్ వేల్స్ లో చేయబోతున్నారట. మొత్తానికి సమంత హాలీవుడ్ సినిమా ఒప్పుకొని హాట్ టాపిక్ గా మారారు.
This post was last modified on November 14, 2021 3:05 pm
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…