పవన్ కి సినీ పెద్దల స్పెషల్ రిక్వెస్ట్!

సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలైన సమయంలో టికెట్ రేట్లను తగ్గించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పిడిప్పుడే నిర్మాతలకు ఫేవర్ గా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని, సినీ పెద్దలను ఏకిపారేస్తూ ఓ స్పీచ్ ఇచ్చారు. దీంతో అప్పటివరకు ఏపీ ప్రతినిధుల చుట్టూ తిరిగిన నిర్మాతలు తలలు పట్టుకున్నారు. మళ్లీ ఏపీ ప్రతినిధుల చుట్టూ తిరిగి టికెట్ రేట్లు పెంచమని రిక్వెస్ట్ చేసుకున్నారు.

కానీ ఇప్పటివరకు టికెట్ హైకింగ్ విషయంలో జగన్ ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ టాలీవుడ్ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన కొత్త ప్రపోజల్ విషయంలో ఏపీ గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ‘పుష్ప’ రిలీజ్ కి ముందు కానీ.. లేకపోతే సంక్రాంతి పండగకు కానీ టికెట్ రేట్స్ ను పెంచే అవకాశాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘భీమ్లా నాయక్’ సినిమా గనుక సంక్రాంతికి వస్తే.. ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది.

అందుకే ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి పవన్ ను తన సినిమాను వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. 2022 వేసవి వరకు సినిమాను పోస్ట్ పోన్ చేసుకోమని అడుగుతున్నారట. కానీ ‘బీమ్లా నాయక్’ మేకర్స్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికైతే.. సినిమాను జనవరి 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గనుక డిసెంబర్ లోపు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తే.. పవన్ తన సినిమాను జనవరిలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.