ఇండియన్ సినిమా గత దశాబ్ద కాలంలో చాలా మారింది. ఇంతకుముందు ఊహకు కూడా అందని కాన్సెప్టులతో సినిమాలు తీశారు. తీస్తున్నారు. హీరో వీర్య దాతగా ఉండే కథతో ఓ సినిమా వస్తుందని.. దాన్ని భారతీయ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసి ఘనవిజయాన్నందిస్తారని ఎవరైనా ఊహించారా? హిందీలో విక్కీ డోనర్ ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కి పెద్ద హిట్టయింది. బాలీవుడ్ దాకా ఎందుకు తెలుగులో తన అంగం చిన్నదని బాధపడే కుర్రాడి కథతో సినిమా వస్తుందని ఎవరైనా ఊహించారా? ఏక్ మిని కథ ఈ కాన్సెప్ట్‌తోనే తెరకెక్కింది. దానికీ మంచి స్పందన వచ్చింది.
మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్స్‌తో మరిన్ని సినిమాలు తయారవుతున్నాయి. అందులో ఒకటి.. ఛత్రివాలి. హిందీలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ఇది.
ఈ చిత్రంలో రకుల్ క్యారెక్టర్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఆమె కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించనుంది. అంటే కండోమ్ క్వాలిటీ ఎలా ఉందో పరిశీలించే ఉద్యోగి పాత్ర అన్నమాట. ఇలాంటి పాత్రను ఒక హీరో చేయడానికే సందేహిస్తాడు. అలాంటిది హీరోయిన్ చేయడమంటే సెన్సేషన్ అనే చెప్పాలి. రకుల్ లాంటి ఫేమస్ హీరోయిన్ ఈ పాత్ర చేయడం షాకింగే. ఈ సినిమా కాన్సెప్ట్‌కు తగ్గట్లే ఫస్ట్ లుక్ కూడా స్టన్నింగ్‌గా తీర్చిదిద్దారు. రకుల్ కండోమ్ ప్యాకెట్ చించి.. పరిశీలనగా చూస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ముందు రకుల్ చేతిలో ఉన్నదేంటో అర్థం కాక జనాలు లైట్ తీసుకున్నారు కానీ.. అది కండోమ్ ప్యాకెట్ అని అర్థమయ్యాక ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కచ్చితంగా ఈ సినిమా ఒక సెన్సేషన్ అయ్యేలాగే కనిపిస్తోంది. తేజస్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నాడు.
This post was last modified on November 14, 2021 8:07 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…