కొన్ని కాంబినేషన్స్ ఊహకు కూడా అందవు. కానీ అవి నిజంగా సెట్ అవుతున్నాయని తెలిస్తే ఆనందం మామూలుగా ఉండదు. రీసెంట్‌గా మెగా ఫ్యాన్స్ ఓ కాంబో విషయంలో అలాంటి ఆనందాన్నే పొందారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఓ మూవీ చేయబోతున్నారని తెలియడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు అది నిజం కాదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ ప్లేస్‌లోకి రవితేజ వచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి.
చిరంజీవి హీరోగా బాబి డైరెక్షన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. పూనకాలు లోడింగ్ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా వదిలారు. అయితే మిగతా నటీనటుల వివరాలేమీ చెప్పలేదు. కథ గురించీ హింట్ ఇవ్వలేదు. అయితే ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ ఉందని, అది చిరంజీవికి తమ్ముడి పాత్ర అని, దాన్ని పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడనే టాక్ అయితే ఇండస్ట్రీలో మొదలైంది.
ఇది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలీదు. కాకపోతే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందే ఈ చిత్రం ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనే విషయం మాత్రం తెలుసు. కాబట్టి ఇలాంటి సినిమాకి అలాంటి అదిరిపోయే ప్లానేదో బాబి వేసే ఉంటాడని అనుకుంటారంతా. కానీ ఈ కాంబో సెట్ కాలేదట. దాంతో బాగా ఆలోచించి చివరికి రవితేజకి టీమ్ ఫిక్సయ్యిందని అంటున్నారు.
రవితేజ చిరంజీవికి ఎంత పెద్ద అభిమానో అందరికీ తెలుసు. గతంలో ‘అన్నయ్య’ సినిమాలో ఓసారి చిరంజీవికి తమ్ముడిగా కనిపించాడు కూడా. ఇప్పుడు కూడా తమ్ముడిగా చేయమని అడగ్గానే ఒప్పుకున్నాడని టాక్. పైగా మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్ తీస్తున్న సినిమా కాబట్టి ఈ రేంజ్ కాంబోని సెట్ చేయగలిగే చాన్స్ అయితే ఉంది. అదే కనుక నిజమైతే ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదు. అటు మెగాస్టార్ పవర్‌ఫుల్ యాక్షన్, ఇటు రవితేజ మాస్ పర్‌ఫార్మెన్స్ మిక్సయ్యి ఫ్యాన్స్‌కి నిజంగానే పూనకాలు వచ్చేస్తాయి. మరి ఈ వార్తయినా నిజమవుతుందో లేదో చూడాలి.
This post was last modified on November 12, 2021 7:25 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…