మల్లికా శెరావత్.. ఈ పేరు వింటేనే ఒకప్పుడు కుర్రకారు కలల్లోకి జారుకునేవారు. మర్డర్ లాంటి సినిమాల్లో సెక్సీ క్వీన్‌గా ఆమె చేసిన విన్యాసాలను ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే ఒకే తరహా నటనని, పాత్రల్ని ప్రేక్షకులు ఎన్నాళ్లని చూస్తారు? బోర్ కొట్టడం మొదలైంది. మల్లిక కెరీర్ కూడా డల్ అవడం స్టార్ట్ అయ్యింది. ఎప్పడైనా ఓ సినిమా మాత్రమే చేసే పరిస్థితి వచ్చింది.
చివరగా 2019లో ‘బూ సబ్‌కీ ఫటేగీ’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది మల్లిక. తర్వాత ఆమె ఊసే లేకపోవడంతో కెరీర్ అయిపోయింది అనుకున్నారంతా. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యి షాకిచ్చింది మల్లిక. వీసీ వడివుదయన్ అనే తమిళ దర్శకుడు ‘నాగమతి’ అనే ట్రైలింగ్యువల్ మూవీని ప్లాన్ చేశాడు. అందులో లీడ్ రోల్ చేస్తోంది మల్లిక. ఈ ప్రాజెక్టు గురించిన వివరాలు పోయినేడే బైటికి వచ్చాయి. కానీ ఆ తర్వాత దీని గురించిన సమాచారమేమీ లేకపోవడంతో ఆగిపోయి ఉంటుంది అనుకున్నారు. అయితే ఈ మూవీ నిన్న ముంబైలో మొదలైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది.
గతంలో ‘దశావతారం’లో ఓ పాత్రలో కనిపించింది మల్లిక. ఇప్పుడు టాలీవుడ్‌కి కూడా పరిచయమవడం ఆనందంగా ఉంది అంటోంది. ఒకేసారి మూడు భాషల్లో డైలాగ్స్ చెప్పడం ప్రాక్టీస్ చేస్తోందట. టైటిల్‌ని బట్టి ఇదేదో నాగిని కథ అని అర్థమవుతోంది. గతంలో ఇలాంటి సినిమా ఒకటి చేసిందామె. మళ్లీ అలాంటి కథంటే కాస్త రిస్కే. బేసిగ్గా మల్లిక సినిమా అంటే జనాలు ఏమేం ఎక్స్‌పెక్ట్ చేస్తారో తెలిసిందే. కాకపోతే ఇప్పుడామె అంత ఫామ్‌లో లేదు. తనని మించిన హాట్ గాళ్స్ చాలామంది ఇండస్ట్రీని ఏలుతున్నారు. మరి దర్శకుడు మల్లికని ఎలా చూపించి ప్రేక్షకుల్ని కన్విన్స్ చేస్తాడో చూడాలి.
This post was last modified on November 12, 2021 1:36 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…