‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి పేరు సంపాదించింది కొత్తమ్మాయి ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాదీ అమ్మాయి నటన మీద మక్కువతో కాలేజీ రోజుల్లోనే థియేటర్స్ గ్రూప్స్‌లో చేరి.. అక్కడ ప్రతిభ చాటుకుని.. అనుకోకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ కళ్లల్లో పడి.. అతడి నిర్మాణంలో కేవీ అనుదీప్ రూపొందించిన ‘జాతిరత్నాలు’లో అవకాశం దక్కించుకుంది.
రెగ్యులర్ స్టార్ హీరోయిన్లకు భిన్నమైన లుక్, నటనతో ఆమె ప్రత్యేకంగా కనిపించింది ‘జాతిరత్నాలు’లో. ఈ సినిమాతో ఆమె దశ తిరిగిపోతుందన్న అంచనాలు కలిగాయి కానీ.. వెంటనే అవకాశాలు మాత్రం రాలేదు. రవితేజ సరసన ఓ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్లు వార్తలొచ్చాయి కానీ.. అవి నిజం కాలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో చిన్న క్యామియో లాంటి రోల్ మినహాయిస్తే ఫరియా ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ అవకాశం అందుకోలేదు.
ఐతే ఎట్టకేలకు ఫరియాకు ఓ పేరున్న సినిమాలో అవకాశం దక్కినట్లు సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కబోయే ‘డి అండ్ డి’కి ఆమెనే కథానాయికగా ఎంచుకున్నారట. నిజానికి ఫరియా టాలెంటుకి ఇంతకంటే మంచి అవకాశమే దక్కాలి కానీ.. తనకు ఛాన్సులే రాని నేపథ్యంలో దీన్నే మహాప్రసాదం అనుకోవాలి. మంచు విష్ణు, శ్రీను వైట్ల పునర్వైభవం కోసం గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉండటంతో ఈ సినిమా హిట్టయి తన కెరీర్‌కు కూడా ఉపయోగపడుతుందని ఫరియా ఆశించవచ్చు.
విష్ణు-వైట్ల కలయికలో వచ్చిన ‘ఢీ’ పెద్ద హిట్ కాగా.. ఆ లైన్స్‌లోనే ఈ సినిమాను తీయబోతున్నారు. పేరు ఆ చిత్రాన్ని తలపించినా ఇది సీక్వెల్ కాదంటోంది చిత్ర బృందం. దీన్ని మంచు విష్ణునే స్వయంగా నిర్మించబోతున్నాడు.
This post was last modified on November 11, 2021 12:36 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…