గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్లో వరుసగా కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు. గురువారం ఒక్క రోజే రెండు క్రేజీ సినిమాలకు విడుదల తేదీల ప్రకటన జరిగింది. అందులో ఒకటి ఖిలాడి కాగా.. ఇంకోటి పక్కా కమర్షియల్. ఫిబ్రవరి 11న మేజర్ మూవీ రిలీజవుతున్న రోజే… రవితేజ సినిమాను షెడ్యూల్ చేయడం తెలిసిందే.
ఇక పక్కా కమర్షియల్ సినిమాకు మార్చి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ నెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. మారుతితో భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్-2, యువి క్రియేషన్స్ బేనర్లోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది. మారుతి స్టయిల్లో మంచి ఎంటర్టైనర్‌లాగా కనిపిస్తోందీ సినిమా. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆ ఊపులోనే రిలీజ్ డేట్ ప్రకటించారు.
మార్చి నెలాఖరు నుంచి భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా వరుస కడుతుండగా.. కొంచెం ముందుగా పక్కా కమర్షియల్‌కు డేట్ ఎంచుకున్నారు. ఆ నెల మధ్య నుంచే వేసవి సందడి మొదలవుతుంది. ఒక రకంగా పక్కా కమర్షియల్‌తోనే వేసవి సందడి ఆరంభం కాబోతోందన్నమాట. ఇటీవల సీటీమార్‌తో గోపీచంద్ కాస్త ఉపశమనం పొందాడు.
ఈ సినిమా పెద్ద హిట్ కాదు కానీ.. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్నందుకుని గోపీచంద్ ఖాతాలో మరో ఫ్లాప్ పడకుండా చూసింది. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. టీజర్‌కు రెస్పాన్స్ కూడా బాగుంది. కాబట్టి ఈ సినిమాతో తాను కోరుకున్న హిట్ దక్కుతుందని గోపీచంద్ ఆశతో ఉన్నాడు. మారుతి మార్కు వినోదానికి తోడు.. గోపీచంద్ స్టయిల్ యాక్షన్ కూడా ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది పక్కా కమర్షియల్.
This post was last modified on November 11, 2021 9:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…