సినిమా బడ్జెట్, కలెక్షన్ల పరంగా బాహుబలితో ఏమాత్రం పోలిక లేని సూర్యవంశీ.. ఆ సినిమా రికార్డును ఎలా బద్దలు కొడుతుంది అని సందేహం కలుగుతోందా? నిజమే కలెక్షన్ల పరంగా బాహుబలితో దీనికి పోలిక లేదు. కానీ కరోనా ధాటికి అల్లాడిపోయిన బాలీవుడ్‌కు ఊపిరి పోసేలా ఈ సినిమా థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది.
చాలా విరామం తర్వాత హిందీలో రిలీజైన మాస్ మసాలా సినిమా కావడం.. నార్త్ మార్కెట్ అంతటా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడం.. దీపావళి పండుగ టైంలో సినిమా రిలీజ్ కావడంతో సూర్యవంశీ వెండితెరల్లో వెలుగులు నింపుతోంది. ఈ క్రమంలో బాహుబలి-2, ఎవెంజర్స్-ఎండ్ గేమ్ సినిమాల రికార్డులను అది బద్దలు కొట్టింది. పీక్ టైంలో బుక్ మై షోలో సూర్యవంశీ సినిమాకు సంబంధించి సెకనుకు 17 టికెట్లు అమ్ముడయ్యాయట.
ఇప్పటిదాకా ఇండియన్ బాక్సాఫీస్‌లో ఏ సినిమాకూ ఈ ఫ్రీక్వెన్సీలో టికెట్లు అమ్ముడవ్వలేదట. బాహుబలి-2, ఎవెంజర్స్ సినిమాలకు సంబంధించి సెకనుకు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో తెలియదు కానీ.. వాటిని అధిగమించి సూర్యవంశీ టికెట్ల అమ్మకాల్లో రికార్డు నెలకొల్పినట్లు బుక్ మై షో వాళ్లే స్వయంగా వెల్లడించారు. ఈ గణాంకాల్ని బట్టి సూర్యవంశీ హిందీ ప్రేక్షకుల్లో బాగానే వేడి పుట్టించిందని అర్థమవుతోంది. ఇక మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమాకు వసూళ్ల విషయంలో ఢోకా లేదు.
ఇండియాలో తొలి వీకెండ్లోనే ఈ సినిమా దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ అక్షయ్ సినిమా బాగానే సందడి చేస్తోంది. ఇప్పటిదాకా రూ.35 కోట్ల దాకా ఓవర్సీస్ మార్కెట్ నుంచి వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును ఈజీగానే అందుకునేలా ఉంది.
This post was last modified on November 11, 2021 7:29 am
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…