నేచురల్ స్టార్ నాని కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. అతడి నుంచి బహు భాషల్లో రిలీజ్ కానున్న తొలి చిత్రమిది. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కూడా ఇదే. అంతే కాక.. ఓటీటీల్లో విడుదలవడం, నాని స్థాయికి తగని చిత్రాలు కాకపోవడం వల్ల ‘వి’, ‘టక్ జగదీష్’ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేయగా.. ‘శ్యామ్ సింగ రాయ్’పై వారు చాలా ఆశళతో ఉన్నారు. డిసెంబరు 24న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
దీన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడదుల చేస్తున్నారు. ఐతే ఇన్ని భాషల్లో రిలీజ్ చేస్తూ హిందీలో ఈ సినిమాను విడుదల చేయకపోవడమేంటో అర్థం కావడం లేదు.
ఇదే మాట నానిని అడిగితే.. “నిజానికి శ్యామ్ సింగరాయ్ చిత్రానికి దేశవ్యాప్తంగా విడుదలయ్యే పరిధి ఉంది. అన్ని భాషల వాళ్లకూ నచ్చే యూనివర్శల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లోనే రిలీజ్ చేస్తున్నాం. హిందీలో రిలీజ్ చేసే ఆలోచన లేదు. అలాగని ఈ కథ హిందీలోకి వెళ్లదని చెప్పలేం. దక్షిణాదిన రిలీజయ్యాక బాలీవుడ్ నిర్మాతలకు ఈ సినిమా నచ్చి రీమేక్ అయ్యే అవకాశాలున్నాయి. ఏమో ఏ హృతిక్ రోషనో, ఇంకో బాలీవుడ్ హీరోనో ఈ సినిమాను రీమేక్ చేస్తారేమో. చూద్దాం” అన్నాడు నాని.
ఇక ‘శ్యామ్ సింగరాయ్’ విశేషాల గురించి నాని మాట్లాడుతూ.. ఇందులో శ్యామ్ సింగరాయ్‌తో పాటు వాసు అనే మరో పాత్ర కూడా చేశానని.. రెండూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని.. శ్యామ్ సింగరాయ్ పాత్ర తన కెరీర్లోనే ఒక మైలురాయిలా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. కథానాయికలుగా నటించిన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముగ్గురికీ ఇందులో సమాన ప్రాధాన్యమున్న పాత్రలు దక్కాయని.. సినిమా ఆ ముగ్గురికీ మంచి పేరు తీసుకొస్తుందని నాని అన్నాడు.
This post was last modified on November 9, 2021 9:27 pm
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…