నాని తొలిసారి చేస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ శ్యామ్ సింగ రాయ్. తన పాత్రలో రెండు రకాల వేరియేషన్లు.. ముగ్గురు హీరోయిన్లు.. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోయే యాక్షన్ సీన్లతో సినిమాని చాలా స్పెషల్‌గా ప్లాన్ చేశాడు రాహుల్ సాంకృత్యన్. చిత్రాన్ని డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.
సాధారణంగా ప్యాన్ ఇండియా సినిమా అంటే హిందీలో కూడా రిలీజవ్వాలి. కానీ దాన్ని వదిలేసి నాలుగు భాషల్లోనే ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే డౌట్ అందరిలోనూ ఉంది. దానికి జవాబు ఇప్పుడు తెలిసింది. ఈ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేసే ప్లాన్స్ ఉన్నాయట. అందుకే హిందీలో రిలీజ్ చేసే ఆలోచనను విరమించుకున్నారట. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో నాని కూడా ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయాలని ఉందని, కానీ అక్కడ రీమేక్ చేసే చాన్సెస్ ఉన్నాయని చెప్పడంతో అది నిజమేనని తేలింది.
ఆల్రెడీ బీటౌన్‌లో రీమేక్‌కి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయట. నాని పాత్రలో నటించడానికి హృతిక్ రోషన్ ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. అన్నీ కుదిరితే ఆయనతోనే రీమేక్ చేయొచ్చనే సమాచారం అందుతోంది. ఇప్పటికే నాని నటించిన ‘జెర్సీ’ మూవీని షాహిద్ కపూర్‌తో రీమేక్ చేశారు. అతి త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పుడు మరో సినిమా కూడా బాలీవుడ్‌కి వెళ్తోందంటే నాని అందరినీ అలరించే కథలే ఎంచుకుంటున్నాడని అర్థమవుతోంది.
This post was last modified on November 9, 2021 12:38 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…