తన సినిమాలకు సంబంధించి తనకు తానుగా ఏ విశేషాలూ బయట పెట్టడానికి ఇష్టపడడు దర్శక ధీరుడు రాజమౌళి. అలాగే చిత్ర బృందంలోని వాళ్లు కూడా ప్రమోషన్లలో సినిమా సీక్రెట్స్ ఏవీ బయటపెట్టకుండా చూసుకుంటాడు. ‘బాహుబలి’కి సంబంధించి ఓ వేడుకలో ప్రభాస్ ఏదో చెప్పబోతుంటే.. రాజమౌళి కింది నుంచి ‘నో’ అన్నట్లుగా హెచ్చరిక జారీ చేయడం తెలిసిందే. ఆ మధ్య తన తండ్రి ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ పాత్ర గురించి మీడియాతో మాట్లాడితే.. జక్కన్న నొచ్చుకున్నట్లుగా వార్తలు రావడం తెలిసిందే.
అలాంటి రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఒక ముఖ్యమైన డైలాగ్‌ను ఒక ప్రైవేటు కార్యక్రమంలో తనంతట తానే బయటపెట్టేయడం విశేషం. ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. “యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అది ధర్మయుద్ధమైతే విజయం తథ్యం”.. ఇదీ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ కీలక సన్నివేశంలో వచ్చే డైలాగ్. ఈ మాటను బట్టి సినిమాలో ఒక భారీ యుద్ధం ఉంటుందని.. హీరోలిద్దరూ ధర్మయుద్ధం చేయడం ద్వారా అందులో విజయం సాధిస్తారని అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లో ఛాయిస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజమౌళి ఈ డైలాగ్‌ను పంచుకోవడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’కు ఫేమస్ రైటర్ సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. “నిర్మాత శోభు యార్లగడ్డ ద్వారా ఛాయిస్ ఫౌండేషన్ సతీశ్ పరిచయం అయ్యారు. పిల్లల్లో కలిగే 90శాతం సమస్యలకు పరిష్కారాలున్నాయి. ఛాయిస్ ఫౌండేషన్ పిల్లల కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతోంది” అని అన్నాడు. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’లోని డైలాగ్‌ను పంచుకుని అందరినీ అలరించారు. చిన్నారుల కోసం పనిచేస్తున్న ఈ సంస్థకు 2 కోట్ల రూపాయల చెక్‌ను మాస్ మ్యుచవల్ ఫండ్ తరపున రవి తంగిరాల అందించారు.
This post was last modified on November 9, 2021 9:30 am
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…