టాక్ ఆఫ్ ది టౌన్.. స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ చాలా కాలంగా నటుడు విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా కత్రినాకు సంబంధించి ఇలాంటి వార్తలు వచ్చాయి.

దీంతో ఈసారి పెళ్లి మేటర్ ఎక్కడివరకు వెళ్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు కత్రినాకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని అంటున్నారు. అతి తక్కువమంది స్నేహితులు, బంధువుల సమక్షంలో నిశ్చితార్ధం జరిగిందని టాక్.

డిసెంబర్ మొదటివారంలో పెళ్లి కూడా జరగబోతుందని కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కత్రినా కానీ, విక్కీ కానీ స్పందించలేదు. సోషల్ మీడియాలో ఎక్కడా కూడా ఈ జంట తన ప్రేమ, పెళ్లి విషయాలపై హింట్ ఇవ్వలేదు. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి కత్రినా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటుంది. అందుకే ఎంగేజ్మెంట్, పెళ్లి విషయాలకు సంబంధించి ఆమె ఎక్కడా నోరు విప్పడం లేదు. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా ఎవరికీ పంపలేదట.

గతంలో కత్రినా తన వ్యక్తిగత జీవితంలో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. స్టార్ హీరో రణబీర్ కపూర్ తో డీప్ రిలేషన్షిప్ లో ఉండేది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు. కానీ బ్రేకప్ అయింది.

అప్పటి నుంచి కత్రినా తన పెర్సనల్ విషయాలను సీక్రెట్ గా ఉంచుకుంటోంది. అందుకే ఇప్పటివరకు విక్కీతో రిలేషన్షిప్ గురించి ఎక్కడా స్పందించడం లేదు. డిసెంబర్ 7, 9 తేదీల మధ్యన రాజస్థాన్ లో వీరి పెళ్లి జరగబోతుందని వార్తలొస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!