Movie News

బండ్ల గణేష్ రాంగ్ ఛాయిస్?


బండ్ల గణేష్‌ పేరెత్తగానే అందరి ముఖాల్లో చిరు నవ్వులు పులుముకుంటాయి. సినిమాల్లో ఎప్పుడు కామెడీ పాత్రలే చేయడమే కాదు.. నిర్మాతగా మారాక కూడా వేదికలెక్కినపుడు ఫన్నీ స్పీచ్‌లతో కామెడీనే పండిస్తూ వచ్చాడు. చివరికి రాజకీయాల్లోకి వచ్చినా కూడా బండ్ల గణేష్ కామెడీని విడిచిపెట్టలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటా అని స్టేట్మెంట్ ఇచ్చి కామెడీకి లోటు లేకుండా చేశాడు. ఈ కామెడీ వల్లే అతణ్ని కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు. టికెట్ ఇవ్వలేదు.

రాజకీయాలకు టాటా చెప్పేసి మళ్లీ సినిమాల వైపు చూసిన గణేష్.. నిర్మాతగా రీఎంట్రీ కోసం సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే నటన మీదా దృష్టిపెట్టాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’లో చిన్న కామెడీ క్యారెక్టర్ చేసిన గణేష్.. ఏకంగా లీడ్ రోల్‌లో ‘డేగల బాబ్జీ’ అనే సినిమా చేయడం విశేషం.

నటుడిగా చాలా బిజీగా ఉన్న టైంలోనే లీడ్ రోల్ చేయని గణేష్.. కెరీర్లో ఈ దశలో హీరోగా నటించడం, ఆ సినిమాలో అతడిదొక్కడిదే క్యారెక్టర్ ఉండటం ఊహకందని విషయం. ‘ఒత్త సెరుపు సైజ్ 7’ అనే తమిళ చిత్రం ఆధారంగా ఈ సినిమా ప్రకటించినపుడే అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే తమిళంలో గొప్ప ప్రయోగంగా పేరు తెచ్చుకున్న సినిమా ఇది. అక్కడ మేటి నటుల్లో ఒకడిగా పేరున్న పార్తీబన్ తనే లీడ్ రోల్‌లో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో సినిమాను నిర్మించాడు. అలాంటి పాత్రకు ఇక్కడ మంచి నటులను, ముఖ్యంగా సీరియస్ పాత్రలకు సూటయ్యే వాళ్లను తీసుకుంటే బాగుండేదేమో. బండ్ల గణేష్ బాగా చేయడని కాదు కానీ.. అతడికున్న ‘కామెడీ’ ఇమేజ్ ఈ పాత్రకు ప్రతిబంధకంలా కనిపిస్తోంది. పైగా గణేష్‌ నటనకు చాలా ఏళ్లు దూరంగా ఉండటం వల్ల మార్కెట్ పరంగా కూడా దీనికి మైనస్సే. అతనొక్కడే కనిపించే సినిమాను థియేటర్లకొచ్చి జనాలు చూస్తారా అన్నది సందేహం.

ఓటీటీలో అయినా సరే.. ప్రేక్షకులను ఇలాంటి సినిమాలకు ఆకర్షితుల్ని చేయడం కష్టమే. ఏకపాత్రాభినయంతో సాగే ఈ పాత్రను గొప్ప నటుడెవరైనా చేస్తే తప్ప ఇలాంటి సినిమాపై ఆసక్తిని అంతసేపు సస్టైన్ చేయడం చాలా కష్టం. ట్రైలర్ చూస్తే గణేష్ ఈ సినిమాకు మైనస్ అనే అభిప్రాయం కలుగుతోంది. మరి ఈ అంచనాలను ‘డేగల బాబ్జీ’తో బండ్ల గణేష్ అండ్ కో మెప్పించగలిగితే గ్రేటే.

This post was last modified on November 8, 2021 2:18 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

9 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

9 hours ago