బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో చాలా రోజులపాటు కస్టడీలో ఉంచారు ఎన్సీబీ అధికారులు. ఆర్యన్ ఎన్నిసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా.. దొరకలేదు. ఫైనల్ గా కొన్ని కండిషన్స్ మీద కోర్టు ఆర్యన్ కు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో రకరకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్యన్ ను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ ముంబై జోనల్ ఆఫీసర్ సమీర్ వాంఖేడే విషయంలో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్యన్ ను అరెస్ట్ చేయడానికి ముందు సమీర్ డబ్బులు డిమాండ్ చేశాడనే విషయం కోర్టు వరకు వెళ్లింది.
ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందని.. ఆర్యన్ ను ఈ కేసులో సమీర్ వాఖేండే కావాలనే ఫ్రేమ్ చేశాడనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. మరోపక్క ఈ కేసుపై సిట్ విచారణ కూడా మొదలైంది. ఈ కేసులో ఎన్సీబీపై కూడా విమర్శలు వస్తుండడంతో.. విచారణకు సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ ఆఫీసర్లు ఈ కేసులోని నిందితులను విచారిస్తున్నారు. ఇప్పటికే అర్భాజ్ మర్చంట్ ను సిట్ అధికారులు విచారించారు.
ఆదివారం నాడు షారుఖ్ తనయుడు ఆర్యన్ ను కూడా విచారణకు పిలిచారట ఎన్సీబీ-సిట్ అధికారులు. అయితే అనారోగ్యంగా ఉందని ఆర్యన్ విచారణ నుంచి మినహాయింపుని కోరినట్లుగా సమాచారం. సోమవారం నాడు ఆర్యన్ సిట్ విచారణకు హాజరు కావొచ్చని తెలుస్తోంది. బెయిల్ మీద బయటకొచ్చినా కూడా ఈ కేసు వ్యవహారం ఆర్యన్ ను అంత ఈజీగా వదిలేలా లేదు.
This post was last modified on November 8, 2021 11:31 am
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…