Movie News

సుక్కు.. నిద్ర లేని రాత్రులు

సుకుమార్, అల్లు అర్జున్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఈ చిత్ర విడుదలకు ఇంకో ఇటుగా 40 రోజుల సమయమే మిగిలుంది. డిసెంబరు 17న ‘పుష్ప: ది రైజ్’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఐతే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పటిదాకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు.
ఇంకా కొంత టాకీ పార్ట్ మిగిలి ఉంది. అలాగే ఒక పాటను భారీ స్థాయిలో చిత్రీకరించాల్సి ఉంది. ఇందుకు ఇంకో రెండు వారాలైనా సమయం పట్టేలా ఉంది. ఆ తర్వాత మిగిలిన మూణ్నాలుగు వారాల్లో ఐదు భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమాను అనుకున్న ప్రకారం విడుదలకు సిద్ధం చేయడం అంటే అంత తేలిక కాదు. ఐతే ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి డెడ్ లైన్ అందుకోవాల్సిందే అని దర్శకుడు సుకుమార్ రేయింబవళ్లు కష్టపడుతున్నట్లు సమాచారం.

సినిమాలో మిగిలిన చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణను వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షిస్తూ సుకుమార్ తన అసిస్టెంట్లతో షూట్ చేయిస్తున్నట్లు సమాచారం. ఆయన సినిమా ఎడిటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ప్రతి సన్నివేశాన్ని రకరకాల యాంగిల్స్‌లో, డిఫరెంట్ షాట్స్ తీయడం సుకుమార్‌కు అలవాటు. వాటిలోంచి ఎడిటింగ్ టైంలో బెస్ట్ షాట్ ఎంచుకుని మిక్సింగ్ చేయిస్తాడు. దీని వల్ల సుక్కు సినిమాల ఎడిటింగ్‌కు చాలా సమయం పడుతుంటుంది.

కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ టైంలో అంతకుముందు షూట్ చేసిన రషెస్‌ను కొంత మేర ఎడిటింగ్ చేసుకున్న సుక్కు.. ఇప్పుడు పూర్తి స్థాయి ఎడిటింగ్‌లో మునిగిపోయాడు. అలాగే వివిధ భాషల్లో డబ్బింగ్ పనులనూ పర్యవేక్షిస్తున్నాడు. మిగతా భాషల కంటే చిత్తూరు యాసలో సాగే తెలుగు డబ్బింగ్ వర్క్‌కే చాలా టైం పడుతున్నట్లు సమాచారం. ఎంత కష్టమైనా.. రేయింబవళ్లు కష్టపడైనా డిసెంబరు 17కు సినిమాను విడుదలకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో అడుగులేస్తున్న సుకుమార్ ఆ ప్రయత్నంలో ఏమేర విజయవంతం అవుతాడో చూడాలి.

This post was last modified on November 7, 2021 4:50 pm

Share

Recent Posts

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

5 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

33 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

43 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago