ఈ మధ్యకాలంలో సినిమాల్లో హీరోల కంటే విలన్స్ ను మరింత బలంగా చూపిస్తున్నారు. అలా చూపిస్తే హీరో క్యారెక్టర్ కు మరింత ఎలివేషన్ వస్తుంది. అందుకే మన సినిమాల్లో హీరో క్యారెక్టర్ కు ధీటుగా విలన్స్ ను తీసుకుంటున్నారు. ఇంతకముందు అంటే ఉన్న విలన్స్ నే అలా రిపీట్ చేసేవాళ్లు కానీ ఇప్పుడు వేరే ఇండస్ట్రీల నుంచి నటీనటుల్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తమిళ, మలయాళ నటులు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు.
ఇప్పుడొక కన్నడ నటుడు తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా మైత్రి మూవీస్ సంస్థ ఓ సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ ను ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. కన్నడలో ‘దునియా’ అనే సినిమాతో పాపులర్ అవ్వడంతో అతడికి దునియా విజయ్ అనే పేరొచ్చింది.
ఇప్పుడు అతడిని బాలయ్య సినిమాలో విలన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తను చివరిగా తెరకెక్కించిన ‘క్రాక్’ సినిమాలో మెయిన్ విలన్స్ సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ లను కోలీవుడ్ నుంచి తీసుకొచ్చారు. ఈసారి కన్నడ ఇండస్ట్రీ నుంచి విలన్ ను ఎంపిక చేసుకున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ కి తెలుగులో ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!
This post was last modified on November 5, 2021 8:47 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…