మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి కుడిచేతి మణికట్టుకి సర్జరీ జరిగింది. ఆయన సర్జరీ చేయించుకున్న కొన్ని రోజులకే నందమూరి బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ జరిగింది. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు కూడా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేతికి మైనర్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ టీవీ షోని పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నారు ఎన్టీఆర్. తన తదుపరి సినిమా కొరటాల శివతో చేయబోతున్నారు ఎన్టీఆర్.
ఆ పాత్రకు తగ్గట్లుగా బాడీను మార్చుకోవడానికి జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన కుడిచేతి వేలు ఒకటి విరిగిపోయిందట. వెంటనే వైద్యులను సంప్రదించడంతో చిన్న సర్జరీ చేయాలని సూచించడంతో.. ఎన్టీఆర్ ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రాలేదు. దీపావళి సందర్భంగా ఎన్టీఆర్ తన కుమారులతో కలిసి ఓ ఫొటోను షేర్ చేశారు.
ఈ ఫొటోలో ఎన్టీఆర్ చేతికి ఉన్న బ్యాండేజ్ కనిపించింది. దీంతో విషయమేంటని ఆరా తీస్తే.. ఎన్టీఆర్ చేతికి సర్జరీ జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో బ్యాండేజ్ కూడా తీసేస్తారని సమాచారం. ప్రస్తుతానికైతే.. ఎన్టీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారు. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గోనున్నారు. దాని తరువాత కొరటాల సినిమాను మొదలుపెడతారు ఎన్టీఆర్.
This post was last modified on November 5, 2021 8:43 pm
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…