బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా వెలుగుతోంది సుమ కనకాల. చేతి నిండా ఈవెంట్లతో క్షణం తీరిక లేకుండా ఉంటోంది. ఇప్పుడు వెండితెర మీద కూడా మెరవడానికి రెడీ అయ్యింది. దీపావళి సందర్భంగా అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ అట్రాక్టివ్‌గా ఉంది. రోలుపై ఉన్న ఓ రోకలిని అందుకుంటోంది సుమ. ఆమె చేతిపై వెంకన్న అనే పచ్చబొట్టు ఉంది. దీనికి అర్థమేమిటో తెలియదు కానీ.. సుమ రీఎంట్రీ సంగతి మాత్రం కన్‌ఫర్మ్ అయ్యింది.
సుమకి యాక్టింగ్ కొత్తేమీ కాదు. కెరీర్ ప్రారంభంలో సీరియల్స్ చేసింది. ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే మూవీలో హీరోయిన్‌గానూ నటించింది. పలు తెలుగు, మలయాళ చిత్రాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేసింది. ఆ తర్వాత యాంకర్‌గా బిజీ అయిపోవడంతో నటనకు బ్రేక్ ఇచ్చింది. అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది కూడా. అయితే ఇప్పుడు మళ్లీ యాక్టింగ్‌ని సీరియస్‌గా తీసుకోవాలని డిసైడయ్యింది.
రీసెంట్‌గా ఓ వీడియోతో ఆ విషయాన్ని చెప్పీ చెప్పకుండా చెప్పింది సుమ. మళ్లీ యాక్ట్ చేస్తున్నావంట నిజమేనా అని అందరూ అడగడం, ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి చేసేస్తే పోలా అని ఆమె అనడం ఆ వీడియోలో కనిపించింది. దాంతో ఆమె రీఎంట్రీ ఇస్తోందని అందరికీ అర్థమైంది. అయితే రెమ్యునరేషన్ కోట్లలోనే ఉంటుంది అనడాన్ని బట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కాదు, లీడ్ రోల్‌తోనే ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యుంటుందేమో అనే సందేహం వచ్చింది. ప్రీ లుక్ పోస్టర్‌తో ఆ డౌట్ మరింత బలపడింది. బహుశా ఈ నెల 6న విడుదల కానున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ విషయంపై క్లారిటీ రావచ్చు.
వెన్నెల క్రియేషన్స్ పతాకంపై విజయ్ కలివరపు, అనుష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బలగ ప్రకాష్ దర్శకత్వం వహించబోతున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. స్టార్ యాంకర్‌గా బోలెడంత నేమ్, ఫేమ్ ఉన్న ఈ సమయంలో సుమ అనవసరంగా రిస్క్ తీసుకుంటుందా అంటున్నవారూ లేకపోలేదు. వారి అనుమానాలు తప్పు, తన నిర్ణయం కరెక్టు అని సుమ ప్రూవ్ చేస్తుందేమో చూడాలి.
This post was last modified on November 4, 2021 8:41 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…