ఎట్టకేలకి మాస్ మహరాజా ఫ్యాన్స్ పండగ చేసుకునే రోజు వచ్చేసింది. రవితేజ కూడా ప్యాన్ ఇండియా ఫిల్మ్ ప్రకటించాడు. వంశీ డైరెక్షన్‌లో ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌లో నటించడానికి కమిటయ్యాడు. ‘క్రాక్’ సక్సెస్ తర్వాత వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ, ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని పట్టాలెక్కిస్తూ చెప్పలేనంత జోష్ మీదున్నాడు రవితేజ. రీసెంట్‌గా సుధీర్‌వర్మ డైరెక్షన్‌లో తన డెబ్భయ్యో సినిమాని ప్రకటించాడు. తన డెబ్భై ఒకటో సినిమాని కూడా ప్రకటిస్తాడని తెలియగానే అది ఏ మూవీ అయ్యుంటుందా అని అంచనా వేసే పనిలో పడ్డారు ఫ్యాన్స్. ఆ సస్పెన్స్‌కి ఇప్పుడు తెర దించేశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీని అనౌన్స్ చేశాడు.
1970 ప్రాంతంలో స్టువర్ట్‌పురంలో పేరు మోసిన దొంగ నాగేశ్వరరావు. పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా దొరికేవాడు కాదు. పోలీసులకు చుక్కలు చూపించి టైగర్ నాగేశ్వరరావుగా పాపులర్ అయ్యాడు. అతని జీవితంపై సినిమా తీసేందుకు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్నాడు వంశీ. బెల్లంకొండ శ్రీనివాస్‌తో తీయబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ చివరికి ఆ ప్రాజెక్ట్ రవితేజ చేతికి వచ్చింది. అభిషేక్ అగర్వాల్ ప్యాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్, మధి లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.
ఈ పాత్ర కోసం రవితేజ పూర్తిగా మేకోవర్ అవుతున్నాడట. తన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్.. అన్నీ కొత్తగా, సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని చెబుతున్నారు. అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంటరెస్టింగ్‌గా ఉంది. ఇందులో నాగేశ్వరరావు కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అతను నడచుకుంటూ వెళ్తున్నాడు. పాదముద్రలు మాత్రం అతనివి కాదు.. టైగర్‌వి. ‘ఫీల్ ద సైలెన్స్ బిఫోర్ ద హంట్’ అనే క్యాప్షన్‌తో సినిమాపై మంచి ఫీల్‌ని కూడా కలిగించే ప్రయత్నం చేశారు. ఇంతవరకు మాస్ సినిమాలతో, ఫిక్షనల్ క్యారెక్టర్స్‌తో అదరగొట్టిన రవితేజ.. ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్‌లో ఎలా ఉంటాడో చూడాల్సిందే.
This post was last modified on November 4, 2021 4:31 am
ఏపీ సీఎం చంద్రబాబు.. అనూహ్యంగా ఢిల్లీ బాట పట్టారు. గురువారం అర్ధరాత్రి ఆయన ఢిల్లీలో దిగిపోయారు. ఈ అనూహ్య పర్యటన…
ఏపీలో రాజకీయం నానాటికీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంటే… రికార్డు విక్టరీ కొట్టిన…
2025 తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ నమోదు చేసే దిశగా పరుగులు పెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం పది రోజులకే 230…
భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే…
కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా?…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు.…