సీనియర్ హీరో రాజశేఖర్ చాలా వరకు సీరియస్ సినిమాలు చేస్తుంటాడు. ఇక దర్శకుడు శ్రీను వైట్ల పేరెత్తితే కామెడీ సినిమాలే గుర్తుకొస్తాయి. మరి ఈ కలయికలో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది? అస్సలు ఊహకందని కాంబినేషన్ కదా ఇది. ఈ కాంబినేషన్లో 20 ఏళ్ల కిందటే ఓ సినిమా రావాల్సిందట. ఈ సినిమాకు ‘అపరిచితుడు’ అనే టైటిల్ కూడా ఖరారైందట. కానీ ఏవో కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీను వైట్లను ఆలీ నిర్వహించే టీవీ షోలో వెల్లడించడం విశేషం.
ఈ మధ్య ‘దూకుడు’ దశమ వార్షికోత్సవం అయినప్పటి నుంచి వైట్ల మీడియాకు తరచుగా ఇంటర్వ్యూలిస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలీ షోలో పాల్గొన్నట్లున్నారు.
ఈ సందర్భంగా తన అరంగేట్రం రాజశేఖర్ సినిమాతో జరగాల్సిందని వెల్లడించాడు వైట్ల. ఐతే ఆ సినిమా మొదలైనట్లే మొదలై ఆగిపోయిందని.. తర్వాత రవితేజతో ‘నీకోసం’ చేశానని వైట్ల తెలిపాడు. ఈ సినిమా చూసిన రామోజీరావు ఇంప్రెస్ అయి తన సంస్థలో సినిమా అవకాశం ఇస్తానన్నారని.. ఐతే ఓ మంచి రోజు చూసి సినిమా మొదలుపెడదాం అని తాను అంటే.. ‘‘ఛెడ్డ రోజే మొదలుపెట్టండి. సినిమా ఎందుకు ఆడదో చూద్దాం’’ అని ఆయన అన్నట్లుగా వైట్ల వెల్లడించాడు.
వైట్ల-రామోజీరావు కలయికలో వచ్చిన ‘ఆనందం’ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇక ‘ఆగడు’ సినిమా ఎందుకు ఫ్లాపైందో కూడా వైట్ల ఈ ఇంటర్వ్యూలో వివరించాడు. మహేష్ అభిమానులు మాస్ సినిమా కావాలని ఒకటే పోరు పెట్టేశారని… వాళ్ల ఆకాంక్షలకు తగ్గట్లు సినిమా తీశానని.. ఐతే ఇతరుల గురించి ఆలోచించకుండా మనల్ని మనం సేవ్ చేసుకోవాలనే పాఠం ఈ సినిమాతో నేర్చుకున్నానని వైట్ల తెలిపాడు. ఇవన్నీ ఈ ఎపిసోడ్ ప్రోమో ముచ్చట్లే. మరిన్ని ఆసక్తికర విషయాలతో కూడిన ఈ ఎపిసోడ్ ఈ వారం ప్రసారం కానుంది.
This post was last modified on November 2, 2021 3:46 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…