‘పుష్ప’ సినిమాతో తొలిసారి ప్యాన్ ఇండియా స్థాయిలో సందడి చేయబోతున్నాడు అల్లు అర్జున్. డిసెంబర్ 17న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలైపోయాయి. ఒక్కో సాంగ్‌నీ విడుదల చేస్తూ ఆడియెన్స్‌ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. అయితే ‘పుష్ప’ హ్యాంగోవర్ ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ఉందంటున్నారు బుక్ మై షో వారు. మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల గురించి తెలుసుకోడానికి వాళ్లు చేసిన సర్వేలో పుష్ప ఆరో స్థానంలో నిలిచింది మరి.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ ప్రతి చోటా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కోసం క్యూలో ఉన్నాయి. వీటిలో ఏ సినిమాలు చూడాలని ప్రేక్షకులు క్యూరియస్‌గా ఉన్నారు అనే విషయంపై బుక్ మై షో జాతీయ స్థాయిలో ఓ సర్వే చేసింది. ప్రేక్షకులు చెప్పినదాన్ని బట్టి టాప్ టెన్ సినిమాల లిస్టు వేస్తే.. అందులో అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ మొదటి స్థానంలో, మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్’ రెండో స్థానంలో నిలిచాయి. మన ‘పుష్ప’ సిక్స్త్ ప్లేస్‌లో ఉంది.
డబ్బింగ్ సినిమాల ద్వారా అల్లు అర్జున్ ఇతర భాషల వారికీ కూడా ఫేవరెట్ స్టార్ అయ్యాడు. అయితే మలయాళీలకు తనంటే ఎంత ఇష్టమో చాలాసార్లు ప్రూవ్ అయ్యింది కానీ, ఇతర భాషల వారి సంగతేమిటో ఇంతవరకు క్లియర్‌గా తెలియదు. కానీ ఈ సర్వే వల్ల అతనికి దేశమంతటా అభిమానులు ఉన్నారని అర్థమైపోయింది.
ముఖ్యంగా ఓ సౌత్ హీరో వెళ్లి బాలీవుడ్ వారిని ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటిది ‘పుష్ప’ కోసం వెయిట్ చేస్తున్నామని అక్కడి ప్రేక్షకులు కూడా చెప్పారంటే.. ఇక బన్నీ నార్త్‌లో కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయమనిపిస్తోంది.