Movie News

రాక్ష‌సావ‌తారంలో ర‌వితేజ‌

మాస్ రాజా ర‌వితేజ మ‌ధ్య‌లో వ‌రుస ఫ్లాపుల‌తో బాగా ఇబ్బంది ప‌డ్డాడు. గ‌త ఏడాది డిస్కో రాజా టైంకి అయితే ర‌వితేజ మార్కెట్ కూడా బాగా దెబ్బ తినేసింది. ఐతే క్రాక్ మూవీతో అత‌ను భ‌లేగా పుంజుకున్నాడు. ఆ సినిమా క‌రోనా టైంలో, 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీలో రిలీజై అనూహ్య‌మైన వ‌సూళ్లు సాధించింది.

మాస్ రాజా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఊపులో ర‌వితేజ వ‌రుస‌బెట్టి సినిమాలు లాగించేస్తున్నాడు. ఆల్రెడీ ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల‌ను చివ‌రి ద‌శ‌కు తీసుకెళ్లిన మాస్ రాజా.. ఇటీవ‌లే త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే తాజాగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు.

అభిషేక్ నామా నిర్మాణంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌తో అమితాస‌క్తిని రేకెత్తించింది. హీరోస్ డ‌సెంట్ ఎగ్జిస్ట్ అనే క్యాప్ష‌న్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. దీని వెనుక ఉద్దేశం ఏంటా అని అంతా చ‌ర్చించుకుంటున్నారు. ఐతే ఇందులో హీరో క్యారెక్ట‌ర్ నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుంద‌ని.. జైలవ‌కుశ‌లో జై పాత్ర త‌ర‌హాలో ఉండే క్యారెక్ట‌ర్ ఇద‌ని.. అందుకే ఈ క్యాప్ష‌న్ పెట్టార‌ని స‌మాచారం.

అంతే కాక ఈ సినిమాకు రావ‌ణాసుర అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇలాంటి నెగెటివ్ టైటిల్‌తో, రాక్ష‌సుడి పేరుతో సినిమా రావ‌డం అరుదే. ఇంత‌క‌ముందు రావ‌ణ పేరుతో మోహ‌న్ బాబు ఓ సినిమా చేయాల‌నుకున్నారు కానీ.. అది సాధ్య‌ప‌డ‌లేదు. ఇప్పుడు ఆ టైటిల్‌ను పొడిగించి మాస్ రాజా వాడుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

1 hour ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

2 hours ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

3 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

3 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

4 hours ago

మారుతి అడ్రస్ ఛాలెంజ్… టోల్ మెటీరియల్ ఐపోయింది

సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…

5 hours ago