2022 సంక్రాంతి సినిమాలపై ఇంకా ఒక క్లారిటీ లేదు. ముందు అనుకున్న ప్రకారం అయితే జనవరి 12, 13, 14 తేదీల్లో వరుసగా భీమ్లానాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ రావాల్సింది. కానీ గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి డోలాయామాన పరిస్థితి కనిపిస్తోంది. ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సిన సినిమా కావడంతో దాన్ని అనుకున్నట్లే జనవరి 14న రిలీజ్ చేయడానికి మేకర్స్ ఫిక్సయ్యారు.
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ నుంచి వారం రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి, ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ఫాలోయింగ్ మీద నమ్మకంతో మేకర్స్ సంక్రాంతి పందేనికి సిద్ధమయ్యారు. కానీ భీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాల విషయంలో మాత్రం వాటి నిర్మాతలు కొంచెం తటపటాయిస్తున్నారు. అలాగని వెంటనే వాయిదా అంటే ‘ఆర్ఆర్ఆర్’కు భయపడినట్లవుతుందని మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారు. అదే సమయంలో ముందు రిలీజ్ డేట్ ప్రకటించింది తామే కాబట్టి మధ్యలో ‘ఆర్ఆర్ఆర్’ రావడం అన్యాయమంటూ ఇండస్ట్రీ పెద్దల దగ్గర పంచాయితీలు పెట్టారు. ఆ సినిమాను వాయిదా వేయించేందుకు కూడా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది.
‘ఆర్ఆర్ఆర్’ టీం అన్నీ చూసుకునే డేట్ ఫిక్స్ చేసింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడ్డ సినిమాను ఇంకోసారి పోస్ట్ పోన్ చేయడం కష్టమని తేల్చేసింది. ఈ మేరకు ప్రమోషన్ల హడావుడి కూడా మొదలైపోయింది. కాబట్టి భీమ్లానాయక్, సర్కారు వారి పాట చిత్రాలు ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. కానీ వాటి నిర్మాతల నుంచి ప్రకటన మాత్రం రావట్లేదు.
ఐతే ఇలాంటి సమయంలోనే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమా మీద ఉన్న అంచనాల్ని ఇంకొన్ని రెట్లు పెంచేసిందీ చిన్న టీజర్. కేవలం 40 సెకన్ల వీడియోతోనే ప్రకంపనలు రేపాడు రాజమౌళి. మళ్లీ ‘బాహుబలి’ లాగే స్క్రీన్లను తగలెట్టేయబోతున్నాడని అర్థమైపోయింది. ఇంకా సంక్రాంతి మీద ఆశలేమైనా పెట్టుకుని ఉంటే మీ ఇష్టం అని.. రేసులో ఉన్న మిగతా చిత్రాలకు ఒ హెచ్చరిక జారీ చేసినట్లుగా ఉంది ఈ గ్లింప్స్. ఇక అహానికి పోకుండా భీమ్లానాయక్, సర్కారు వారి పాట చిత్రాలను వాయిదా వేసేస్తున్నట్లు వాటి నిర్మాతలు ప్రకటించడం ఉత్తమమేమో.
This post was last modified on November 1, 2021 2:41 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…