Movie News

ప్రశాంత్ నీల్.. రేడియేషన్ సూట్ రెడీనా?

రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో ఒక్కసారిగా తన రేంజ్ పెంచుకోబోతున్న ఎన్టీఆర్.. దాని తర్వాత ఎవరితో, ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా సెట్ చేసుకున్నాడు తారక్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

ఇది పక్కా సమాచారమే అయినా.. ఇప్పటిదాకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి పరోక్ష సంకేతాలు అందుతూనే ఉన్నాయి. గత నెలలో తారక్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ఓ స్పెషల్ ట్వీట్ వేశాడు. ఎన్టీఆర్‌ ఎనర్జీ గురించి చెబుతూ.. అతను పక్కనుంటే న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చున్నట్లు ఉంటుందని.. ఈసారి రేడియేషన్ సూట్ వేసుకుని వస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

దీన్ని బట్టే ప్రశాంత్.. ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడని స్పష్టమైంది. ఇప్పుడు ఈ ట్వీట్‌కు కొనసాగింపుగా ఒక ట్వీట్ వేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. గురువారం ప్రశాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అతడికి శుభాకాంక్షలు చెబుతూ.. అతను రేడియేషన్ సూట్ వేసుకుని వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు చమత్కరించింది. అంటే తారక్-ప్రశాంత్ సినిమా కోసం తాము ఎదురు చూస్తున్నట్లు ఆ సంస్థ పరోక్షంగా చెప్పిందన్నమాట.

మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కూడా ప్రశాంత్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజులు శుభాకాంక్షలు చెప్పడానికి కారణం తారక్‌తో అతను సినిమా చేయబోతుండటమే అన్నది స్పష్టం. మరి ఈ ప్రాజెక్టు గురించి ఇలాంటి దోబూచులాటలు కాకుండా.. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

This post was last modified on June 4, 2020 3:20 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

37 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

47 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

1 hour ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

1 hour ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

4 hours ago