దసరా చిత్రాల హంగామా తర్వాత ఒక వారం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త సినిమాల సందడి పెద్దగా లేకపోయింది. గత వారాన్ని కూడా దసరా చిత్రాలకే దాదాపు రాసిచ్చేసినట్లయింది. లాస్ట్ వీక్ వచ్చిన చిత్రాలన్నీ దాదాపు నామమాత్రమే అని చెప్పాలి. ‘నాట్యం’ సహా ఏ చిత్రమూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇక ఈ వారం మాత్రం రెండు పేరున్న చిత్రాలు బాక్సాఫీస్ పరీక్షకు రెడీ అయ్యాయి. అవే.. వరుడు కావలెను, రొమాంటిక్. ఈ రెండు చిత్రాలూ వాటి హీరోలకు చాలా కీలకమైనవి. ఈ సినిమాలు హిట్టవడం వారికి చాలా అవసరం.
ముందుగా ‘వరుడు కావలెను’ విషయానికి వస్తే.. ‘ఛలో’ తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న నాగశౌర్య ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ప్రోమోలు చూస్తే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది.
నాగశౌర్యతో పాటు హీరోయిన్ రీతూ వర్మల పాత్రలు ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ రెండూ కూడా ఆకట్టుకున్నాయి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న సంకేతాలు ఇచ్చాయి. ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య అనే కొత్త దర్శకురాలు పరిశ్రమకు పరిచయం అవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
ఇక శుక్రవారం బరిలో ఉన్న రెండో చిత్రం ‘రొమాంటిక్’ హీరోగా తనకు తొలి విజయాన్నందిస్తున్న ఆశతో ఉన్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్. ఇప్పటికే లీడ్ రోల్స్ చేసిన రెండు సినిమాలు నిరాశ పరచడంతో ఈ సినిమా బాగా ఆడటం ఆకాశ్‌కు చాలా అవసరం. పూరి స్క్రిప్టుతో ఆయన శిష్యుడు అనిల్ పాడూరి ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ఆకాశ్ సరసన కథానాయికగా నటించిన కొత్తమ్మాయి కేతిక శర్మ ప్రోమోల్లో సూపర్ సెక్సీగా కనిపిస్తూ కుర్రాళ్ల దృష్టిని ఆకర్షిస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య ఘాటు రొమాన్స్ తప్ప పెద్దగా ఆకర్షణలు కనిపించలేదు ఈ చిత్ర ప్రోమోలు చూస్తే. మరి శుక్రవారం బాక్సాఫీస్‌లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పైచేయి సాధిస్తుందా.. రొమాన్స్ ఆధిపత్యం చలాయిస్తుందా అన్నది చూడాలి.
This post was last modified on October 29, 2021 7:36 am
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…