నార్త్ హీరోయిన్లంటే గ్లామర్ విందుకు అస్సలు వెనుకాడరనే అభిప్రాయం బలంగా ఉంటుంది. కానీ కొద్ది మంది మాత్రం ఇందుకు మినహాయింపు. పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ కెరీర్ ఆరంభం నుంచి కొంచెం ట్రెడిషనల్ క్యారెక్టర్లే చేస్తూ వచ్చింది. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ టచ్ ఉన్న పాత్రలు కొన్ని చేసినప్పటికీ ఎప్పుడూ హద్దులు దాటింది లేదు.
క్లీవేజ్ షోలు చేయడం లాంటి దృశ్యాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇలాంటి పాత్రలతోనే కెరీర్ ముగించేసి ఒక దశలో పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడటానికి కూడా రెడీ అయిపోయింది మెహ్రీన్.
కానీ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భవ్యతో ఆమె నిశ్చితార్థం కొన్ని కారణాల వల్ల రద్దవడం.. మెహ్రీన్ తిరిగి సినిమాల్లోకి అడుగు పెట్టడం తెలిసిందే. ఇక అప్పట్నుంచి కెరీర్లో మళ్లీ పుంజుకోవడానికి మెహ్రీన్ గ్లామర్ రూట్లోకి వస్తుండటం విశేషం.
నిశ్చితార్థం రద్దు తర్వాత మెహ్రీన్ చేసిన తొలి చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’లో కొంచెం సెక్సీగానే కనిపిస్తుండటం గమనించవచ్చు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న టైంలో మెహ్రీన్ ఒక ఫొటో షూట్ చేసింది. అందులో ఆమె క్లీవేజ్ షోలు చూసి అందరూ షాకవుతున్నారు.
ఇప్పటి దాకా మెహ్రీన్ కెరీర్లో ఎన్నడూ ఇంత సెక్సీగా కనిపించింది లేదు. ఇది చూస్తే కెరీర్ పొడిగించుకోవడంలో భాగంగా.. తాను గ్లామర్ రోల్స్ చేయడానికి రెడీ అని మెహ్రీన్ ఇస్తున్న హింట్స్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
‘ఎఫ్-2’ సీక్వెల్ ‘ఎఫ్-3’కి సంబంధించిన పోస్టర్లలోనూ మెహ్రీన్ చాలా గ్లామరస్‌గానే కనిపిస్తోంది. కాకపోతే ఒకప్పుడు నిండుగా కనిపించిన మెహ్రీన్.. ఈ మధ్య మరీ బక్కచిక్కి కళ కోల్పోవడమే తన అభిమానులకు కొంచెం నిరాశ కలిగిస్తున్న విషయం. మళ్లీ కొంచెం ఒళ్లు చేసి ఇదే స్థాయిలో గ్లామర్ విందు చేస్తే ఆమె కెరీర్‌కు ఢోకా లేనట్లే.
This post was last modified on October 29, 2021 7:35 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…